Advertisement
Google Ads BL

ద‌ళ‌ప‌తి 69 అనౌన్సమెంట్ వచ్చేస్తుంది


కోట్లాది మంది ఎదురు చూస్తోన్న క్ష‌ణాలు వ‌చ్చేశాయి. చ‌రిత్ర సృష్టించ‌టానికి కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్ సిద్ధంగా ఉంది. ఈరోజు ఫ్యాన్స్‌కు 5 నిమిషాల 30 సెక‌న్ల హృద‌యానికి హ‌త్తుకునే వీడియోతో ఓ ఎమోష‌న‌ల్ రోల్ కోస్ట‌ర్‌ను అందించారు. ఇందులో ద‌ళ‌ప‌తి విజ‌య్ తిరుగులేని లెగ‌సీని సెల‌బ్రేట్ చేశారు. ఇదొక సాధార‌ణ‌మైన బహుమతి అయితే కాదు. ఇదొక ముగింపుకి ప్రారంభం.. ద‌ళ‌ప‌తి 69.. ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి సినిమాకు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. 

Advertisement
CJ Advs

కె.వి.ఎన్ ప్రొడ‌క్ష‌న్స్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌క‌ట‌న‌ల్లో ఇదెంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ప్రేక్ష‌కులు, అభిమానుల హృద‌యాల‌కు కెవిఎన్ ద‌గ్గ‌ర‌గా వెళ్లింది. ఇదేదో ప్ర‌త్యేక‌మైన రీల్ మాత్రం కాదు. ఇండియ‌న్ సినిమాలో, అభిమానుల గుండెల్లో మ‌రెవ్వ‌రూ సంపాదించ‌లేని గొప్ప స్థానాన్ని ద‌క్కించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి సంబంధించింది. అంద‌రి గుండె లోతుల్లో అస‌మాన‌మైన ఆయ‌న స్థానానికి సంబంధించింది. వీధుల్లో, స్టేడియాల్లో అత‌ని పేరుతో వ‌చ్చే ప్ర‌తిధ్వ‌నికి ఈ వీడియో ఓ స‌జీవ సాక్ష్యంగా నిలిచింది. 

ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాల‌నేవి కేవ‌లం ఆస్వాదించ‌టానికే కాదు, అవి జీవితాన్ని మార్చాయి. అభిమానుల భావోద్వేగాలతో వారి హృద‌యాలు అత‌ని రూపంతో నిండిపోయాయి. ఇది వ‌ర‌కు ఎన్న‌డూ లేనివిధంగా దేశ వ్యాప్తంగా ఉన్న న‌గ‌రాలన్నీ భావోద్వేగంతో కూడిని నిరీక్ష‌ణ‌తో ఎదురు చూశాయి. సిల్వ‌ర్ స్క్రీన్‌ను మించి లార్జ‌ర్ దేన్ లైఫ్ అనేలా సినిమాలు చేసిన వ్య‌క్తిని వెండితెర‌పై చివ‌రిసారి వీక్షించ‌టానికి, గౌర‌వించ‌టానికి మేమంతా సంఘ‌టితంగా ఉన్నామ‌ని అంద‌రూ అంటున్నారు. 

స్టార్ డ‌మ్‌కు సరికొత్త నిర్వ‌చ‌నాన్ని చెప్పిన ద‌ళ‌ప‌తి ప్ర‌య‌తాణంలో చివ‌రి అధ్యాయానికి సంబంధించిన ప్ర‌ట‌క‌న‌ శ‌నివారం  భూమి బ‌ద్ధ‌లయ్యేలా రానుంది. అందుకు వేదిక సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ద‌ళ‌ప‌తి 69కు సంబంధించిన ప్ర‌క‌ట‌న రానుంది. దీంతో లెజెండ్‌ ద‌ళ‌ప‌తి విజ‌య్ శిఖ‌రాగ్రానికి చేరుకుంటారు. 

ప్ర‌తీ క్ష‌ణాన్ని మారుతుంది.. హుర్రే అనేలా ద‌ళ‌ప‌తి మ్యాజిక్‌ను థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేయ‌టానికి అభిమానుల‌కు ఇది చివ‌రి అవ‌కాశం. దీనిపై రూపొందించిన వీడియో అంద‌రినీ హ‌త్తుకుంటోంది. ద‌ళ‌ప‌తి విజ‌య్‌కు సంబంధించిన లెగ‌సీని ఎంతో గొప్ప‌గా, ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందులో చూపించారు. 

మీ క్యాలెండ‌ర్‌లో రేప‌టిని (శనివారం) ప్ర‌త్యేకంగా గుర్తుంచుకోండి. భార‌తీయ సినిమా ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని బ్లాసింగ్ అనౌన్స్‌మెంట్‌కి సిద్ధంగా ఉండండి. చివ‌రిసారి ద‌ళ‌ప‌తితో క‌లిసి ఆ వేడుక‌ను సంబ‌రంగా జ‌రుపుకుందాం. 

THALAPATHY 69: THE UNSTOPPABLE EUPHORIA:

THALAPATHY 69: THE UNSTOPPABLE EUPHORIA – KVN PRODUCTION TO ANNOUNCE TOMORROW!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs