Advertisement
Google Ads BL

ఆయ్ టీమ్ కి అల్లు అర్జున్‌ అభినందనలు


మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ఆయ్. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు. ఆగ‌స్ట్ 15న రిలీజైంది. తొలి ఆట నుంచే ఈ ఫన్ ఎంటర్ టైనర్ ఆయ్ ప్రేక్ష‌కాద‌ర‌ణతో  పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోంది. సినీ ప్రేక్షులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు సైతం ఆయ్ సినిమాను చూసి అద్భుత‌మంటూ చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్ప‌టికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నాగ చైతన్య, సాయిపల్లవి చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి విషెష్ అందించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఆయ్’ చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకుని, సినిమా సాధించిన స‌క్సెస్‌పై ప్ర‌శంసించారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో నార్నే నితిన్‌, నిర్మాతలు బ‌న్నీవాస్‌, విద్యా కొప్పినీడి, ద‌ర్శ‌కుడు అంజి కె మ‌ణిపుత్ర‌, హీరోయిన్ న‌య‌న్ సారిక, అంకిత్ కొయ్య‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తొలి ఆట నుంచి మంచి మౌత్ టాక్ తో వరుసగా షోలు, స్క్రీన్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా చూసి ఓ చక్కని సినిమాను చూశామనే ఫీలింగ్‌తో జనాలు బయటకు వస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ ఆధారణపై చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే రోజు రోజుకి సినిమా క‌లెక్ష‌న్స్ పెరుగుతుంది. 

Allu Arjun congratulated AAY team:

Allu Arjun congratulated Narne Nithiin, Nayan Sarika and entire team of fun entertainer AAY
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs