Advertisement

పుష్ప-2: ఫహద్ ఫాజిల్ బన్వర్‌ సింగ్‌ లుక్‌


అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. ది రూల్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న ఫహాద్‌ ఫాజిల్‌ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఫహాద్‌ ఫాజిల్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. బన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా పుష్ప ది రైజ్‌లో ఆకట్టుకున్న ఫహాద్‌ ఈ చిత్రంలో అంతకు మించి క్రేజీగా ఆడియన్స్‌ను ఆకట్టుకోబోతున్నాడు. గల్ల లుంగీ ధరించి.. ఒక చేతిలో గన్‌తో...మరో చేతిలో గొడ్డలితో  ఫహాద్‌ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది.రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. 

Pushpa2: Fahadh Faasil character-centric poster unveiled :

Pushpa: The Rule: Fahadh Faasil character-centric poster unveiled on his birthday 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement