Advertisement
Google Ads BL

పవన్ వీరమల్లులో లెజెండరీ నటుడు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. లెజెండరీ భారతీయ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్ హరి హర వీరమల్లులో భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయన అత్యంత విలువైన, గౌరవనీయమైన పాత్ర పోషిస్తున్నారు.

Advertisement
CJ Advs

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ తో తెరను పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరు అగ్ర నటుల కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అభిమానులను ఎంతగానో అలరిస్తాయని నిర్మాతలు చెబుతున్నారు. హరి హర వీరమల్లు చిత్రం జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తున్నారు.

ఇటీవల, యువ దర్శకుడు జ్యోతి కృష్ణ హరి హర వీరమల్లు చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకొని, సినిమాపై అంచనాలను పెంచే ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రత్యేక టీజర్‌ విశేషంగా ఆకట్టుకోవడంతో, రెట్టింపు ఉత్సాహంతో మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎంతో ప్రభితగల సాంకేతిక నిపుణులు హరి హర వీరమల్లు చిత్రం కోసం పని చేస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస ఈ చిత్రం యొక్క మిగిలిన భాగం చిత్రీకరణ పూర్తి చేయడం కోసం సాంకేతికత బృందంలో చేరారు. 

Anupam Kher joins epic Saga Hari Hara Veera Mallu :

Legendary Actor Anupam Kher joins epic Saga Hari Hara Veera Mallu 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs