Advertisement
Google Ads BL

పవర్ ప్యాకెడ్ ట్రైలర్ : మిస్టర్ బచ్చన్


రవితేజ, హరీష్ శంకర్ కాంబో మిస్టర్ బచ్చన్‌ తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉంది. మూవీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానున్న ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, టీజర్‌తో పాటు పాటలు హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

Advertisement
CJ Advs

రవితేజ చెప్పిన పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు... సంపద కాపాడేవాడు కూడా సైనికుడే.. అనే డైలాగ్ సినిమాకి టోన్ సెట్ చేస్తుంది. రవితేజ కమాండింగ్ ప్రెజెన్స్‌ కట్టిపడేసింది.

బచ్చన్ తన ఊర్లో జిక్కీ అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ట్రైలర్‌లోని రెప్పల్ డప్పుల్ అనే హై-ఎనర్జీ నంబర్‌ ఒక హైలెట్ గా నిలిచింది. పవర్ ఫుల్ వ్యక్తికి వ్యతిరేకంగా ఐటీ దాడులకు నాయకత్వం వహించడానికి హీరో యాక్షన్ లోకి దిగడంతో ట్రైలర్ లో ఇంటెన్స్, కాన్ఫ్లిక్ట్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ట్రైలర్ ప్రామిస్ చేసినట్లుగా, ఈ మూవీ రొమాన్స్, డ్రామా, యాక్షన్ గ్రేట్ బ్లెండింగ్ ని అందిస్తోంది. 

టైటిల్ రోల్‌లో రవితేజ పెర్ఫార్మెన్స్, ఎనర్జీ, చరిష్మా అద్భుతంగా వుంది. మాగ్నెటిక్ ప్రెజెన్స్‌తో స్క్రీన్‌పై అదరగొట్టారు. జగపతి బాబు పవర్ ఫుల్ రోల్ ని పోషించారు. తన క్యారెక్టర్ నెరేటివ్ లో ఇంటెన్స్, కాన్ఫ్లిక్ట్ ని యాడ్ చేసింది. భాగ్యశ్రీ బోర్స్ తన అద్భుతమైన గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. రవితేజ, భాగ్యశ్రీ లవ్లీ కెమిస్ట్రీని పంచుకున్నారు. సత్య అండ్ గ్యాంగ్ హ్యుమర్ రిలీఫ్ ని అందిస్తున్నారు. 

The Theatrical Trailer Of Mr Bachchan Released:

The Theatrical Trailer Of Mass Maharaja Ravi Teja Mr Bachchan Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs