Advertisement
Google Ads BL

యష్ టాక్సిక్ స్టార్ట్ అయ్యింది!!


కె.జి.య‌ఫ్‌తో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన హీరో రాక్ స్టార్ య‌ష్ ఇప్పుడు నిర్మాత‌గా కూడా మారారు. ఇప్పుడు ఆయ‌న పాన్ ఇండియా భారీ బ‌డ్జెట్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌ లో న‌టించ‌నున్నారు. ఆయ‌న, నిర్మాత వెంక‌ట్ కె.నారాయ‌ణ, కుటుంబ స‌భ్యుల‌తో తో క‌లిసి క‌ర్ణాట‌క‌లోని ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్రాలు శ్రీస‌దాశివ రుద్ర సూర్య ఆల‌యం, ధ‌ర్మ‌స్థ‌ల‌లోని శ్రీ మంజునాథేశ్వ‌ర ఆల‌యం, సుబ్ర‌మ‌ణ్య‌లోని కుక్కే సుబ్ర‌మ‌ణ్య ఆల‌యంను సంద‌ర్శించారు.

Advertisement
CJ Advs

ఏదైనా కొత్త సినిమాను ప్రారంభించే ముందు  ఇలా ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌టం య‌ష్‌కున్న అల‌వాటు అని ఆయ‌న అభిమానులు అంటున్నారు. ఆయ‌న‌కు ఫ్యాన్స్ నుంచి చ‌క్క‌టి స్వాగ‌తం ల‌భించింది. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న ఈ చిత్ర షూటింగ్ బెంగ‌ళూరులో ఆగ‌స్ట్ 8 నుంచి ప్రారంభం కానుంది (8-8-8)

ఇలా 8-8-8 అనే నెంబ‌ర్ వ‌చ్చే రోజున య‌ష్ త‌న కొత్త సినిమాను ప్రారంభించటం విశేషం. నెంబ‌ర్ 8తో రాకింగ్ స్టార్ య‌ష్‌కు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయ‌న పుట్టిన తేదితో ఈ తేది స‌రిపోతుంది. అలాంటి ఓ తేదీన టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించ‌నున్నారు.

Yash Toxic: A Fairy Tale for Grown-Ups to commence shooting in Bangalore :

Yash Toxic: A Fairy Tale for Grown-Ups to commence shooting in Bangalore from 8th August 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs