Advertisement

పుష్ప-2 క్లైమాక్స్ గూస్ బంప్స్ అంతే..!


అల్లు అర్జున్‌ హీరో గా సుకుమార్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ నుంచి ఫైనల్ గా అప్ డేట్ వచ్చింది. అది కూడా డిసెంబర్ 6 కి పుష్ప 2 విడుదలని మేకర్స్ కన్ ఫర్మ్ చేసేసారు. ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. 

Advertisement

దేవిశ్రీప్రసాద్‌ అత్యద్భుతమైన  సంగీతానికి, చంద్రబోస్‌ సాహిత్యానికి.. ఆ పాటల్లో హీరో స్టెప్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. 

ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో వున్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూజ్‌ బంప్స్‌ వచ్చే విధంగా వుంటాయని అంటున్నారు. సో అల్లు అర్జున్‌ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్‌ కోసం వెయిట్‌ చేయడమే తరువాయి అంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు.

Pushpa 2: Shoot of a pulse-pounding climax action block is on:

Pushpa: The Rule: Shoot of a pulse-pounding climax action block is on
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement