Advertisement
Google Ads BL

VD 12 రిలీజ్ డేట్ లాక్ చేసేసారు


VD12 విజయ్ దేవరకొండ, తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో స్టార్‌గా ఎదగడమే కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుంది. అలాంటి విజయ్, మళ్ళీరావా, జెర్సీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు, జాతీయ అవార్డు విజేత గౌతమ్ తిన్ననూరితో చేతులు కలిపారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో అందరినీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement
CJ Advs

VD12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో VD12 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా, ఎక్కడా రాజీ పడకుండా ఎంతో శ్రద్ధతో, అవిశ్రాంతంగా పని చేస్తోంది చిత్ర బృందం.

ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలోని సుందరమైన ప్రదేశాల్లో జరిగింది. ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ క్రమంలో చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. 2025, మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.

VD12 in Cinemas Worldwide from 28th March:

VD12 in Cinemas Worldwide from 28th March 2025! 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs