బోనాలు పండుగ సందర్భంగా M4M హీరోయిన్ జో శర్మ బండ్లగూడలోని పేరొందిన కాళీమాతకు బోనం సమర్పించడం జరిగింది.
తెలంగాణాలొ బోనాల పండుగకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇది తెలుసుకొని ఏకంగా కాలిఫోర్నియా నుండి తెలంగాణాకు వచ్చి సాంప్రదాయ దుస్తుల్లొ బోనం ఎత్తుకొని తలపై పెట్టుకొని, ఆలయంలొ ప్రదర్శనలు చేసి కాళీమాతకు బోనం సమర్పించి జగన్మాత కాళీకాదేవి ఆశీస్సులు అందుకోవడం విశేషం.
మోహన్ వడ్లపట్ల గారు దర్శకత్వం వహించిన M4M - Motive For Murder చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరి జోనర్ చిత్రంలొ అత్యధిక ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ పాత్రను జో శర్మ పోషించడం
జరిగింది.
ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని, ప్రేక్షకులందరూ ఆదరించాలని, ఈ చిత్రం కోసం పని చేసిన వారికందరికి మంచి పేరు ప్రతిష్టలు రావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
M4M మూవిలొ తనకు అవకాశం ఇచ్చిన నిర్మాత దర్శకులు మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.