Advertisement

సినీజోష్ రివ్యూ: పేకమేడలు


సినీజోష్ రివ్యూ: పేకమేడలు

Advertisement
-->

బ్యానర్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్

నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు

ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ

మ్యూజిక్: స్మరణ్ సాయి

సినిమాటోగ్రఫీ: హరిచరణ్ కె.

ప్రొడ్యూసర్: రాకేష్ వర్రే

రైటర్ - డైరెక్టర్: నీలగిరి మామిళ్ల

రిలీజ్ డేట్: 19 - 07 - 2024

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నటుడిగా, హీరోగా, నిర్మాతగా సక్సెస్ అందుకున్న వ్యక్తి రాకేష్ వర్రే. మొదట చిన్న క్యారెక్టర్లతో కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత బాహుబలిలో ఐకానిక్ సీన్ వరకు ఆయనది ఇన్‌స్పైరింగ్ జర్నీ. ఎవ్వరికి చెప్పొద్దు వంటి సెన్సిటివ్ ఫీల్ గుడ్ మూవీతో హీరోగా, నిర్మాతగా సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఈసారి పేకమేడలు అంటూ సెన్సిబుల్ సినిమాతో నిర్మాతగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వినోద్ కిషన్, అనూష క్రిష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలు నచ్చడంతో ఈ సినిమా గురించి రానా దగ్గుబాటి, సాయి ధరమ్ తేజ్, విశ్వక్ సేన్ తదితర సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు. సినిమాపై నమ్మకంతో విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షోలు వేశారు. మంచి సినిమా ముద్రతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పేకమేడలు విషయం ఏమిటో సమీక్షలో చూసేద్దాం... 

పేకమేడలు స్టోరీ రివ్యూ...

బీటెక్ చదివిన లక్ష్మణ్ (వినోద్ కిషన్)ది హైదరాబాద్ సిటీలోని ఓ బస్తీ. ఉద్యోగం ఏదీ చేయడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటూ పైసా సంపాదన లేకుండా భార్య మీద పడి బతికేస్తుంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో పని చేయడంతో పాటు పిండి వంటలు చేసి ఒక షాపు యజమానికి ఇవ్వడం ద్వారా కుటుంబ బాధ్యతల చూసుకుంటుంది లక్ష్మణ్ భార్య వరలక్ష్మి (అనూష క్రిష్ణ). 

పిండి వంటల అమ్మకం ద్వారా వచ్చే సంపాదన సరిపోవడం లేదని, కుటుంబ పోషణతో పాటు పిల్లాడికి మెరుగైన జీవితం కోసం కర్రీ పాయింట్ పెడితే మంచి డబ్బులు వస్తాయని వరలక్ష్మి అనుకుంటుంది. అందుకు 50 వేలు అవసరం అవ్వడంతో భర్తను అడుగుతుంది. భార్య పేరు చెప్పి స్నేహితుల దగ్గర లక్ష్మణ్ అప్పు చేస్తాడు. కానీ, ఆ డబ్బు ఆమెకు ఇవ్వడు. అమెరికన్ ఎన్నారై శ్వేతా (రితిక శ్రీనివాస్)ను ట్రాప్ చేయడానికి వాడతాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి సక్సెస్ ఫుల్ గా ట్రాప్ చేస్తాడు. భార్యకు విడాకులు ఇవ్వాలని అనుకుంటాడు. 

లక్ష్మణ్ నిజస్వరూపం శ్వేతాకు తెలిసిందా? శ్వేతా గురించి వరలక్ష్మికి తెలిసిందా? ముగ్గురి జీవితాలు ఎటువంటి మలుపులు తీసుకున్నాయి? ఎన్ని గొడవలు జరిగాయి? చివరకు ఏమైంది? అనేది క్లుప్తంగా పేకమేడలు కథ. 

పేకమేడలు ఆర్టిస్ట్స్ ఎఫర్ట్స్:

హీరో వినోద్ కిషన్‌కు ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా. అయితే నటుడిగా ఆయనకు అనుభవం ఉంది. తమిళ సినిమాలు నా పేరు శివ, అంధగారంలో నటుడిగా తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. పేకమేడలులో బస్తీలో నివసించే భర్తగా ఒదిగిపోయాడు. లుక్స్, డ్రసింగ్, యాక్టింగ్ నుంచి ప్రతి విషయంలో పర్ఫెక్షన్ చూపించాడు. లక్ష్మణ్ లాంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్టును ఓవర్ షాడో చేసింది హీరోయిన్ అనూష క్రిష్ణ. 

పేకమేడలు సినిమాకు అనూష క్రిష్ణ నటన ఆయువు పట్టుగా నిలిచింది. పతాక సన్నివేశాలు చూశాక వరలక్ష్మి పాత్రలో ఆవిడ తప్ప మరొకరు నటించలేరని అనిపిస్తుంది. అంత సహజంగా చేసింది. హీరో హీరోయిన్ల తర్వాత చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ రితిక శ్రీనివాస్ పోషించిన శ్వేతా. గ్లామర్ షో చెయ్యకుండా ఆ ఫీలింగ్ తెచ్చింది. మిగతా క్యారెక్టర్లు ఓకే. వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

పేకమేడలు టెక్నీషియన్స్ ఎఫర్ట్స్:

కథకు తగ్గ టెక్నీషియన్స్ పేకమేడలు సినిమాకు దొరికారు. స్మరణ్ సాయి ట్యూన్స్ బావున్నాయి. రీ రికార్డింగ్ కూడా బాగా చేశారు. హైదరాబాదీ మ్యూజిక్ కొన్ని చోట్ల వినిపించింది. హరిచరణ్ కె కెమెరా వర్క్ నేటివ్ ఫీల్ తీసుకు రావడంలో సక్సెస్ అయ్యింది. ఎడిటర్ కత్తెరకు పని చెప్పాల్సిన సీన్లు ఇంటర్వెల్ ముందు కొన్ని ఉన్నాయి. మూవీ రన్ టైమ్ తక్కువే. కానీ, ఫస్టాఫ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎక్కువ టైమ్ తీసుకున్నారు. 

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. దర్శకుడు నీలగిరి మామిళ్ల రాసుకున్న కథను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో మంచి సపోర్ట్ అందించారని మూవీ చూస్తే తెలుస్తుంది. 

పేకమేడలు విశ్లేషణ:

పేకమేడలు ఆఫ్ బీట్ ఫిల్మ్ అన్నట్టు టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తే కొందరికి అనిపించవచ్చు. కానీ, ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ బాధ్యత లేని భర్తలు వల్ల భార్యలు పడే కష్టానికి మిర్రర్ ఇమేజ్ అన్నట్టు ఉంటుంది. సొసైటీలో, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో జరిగే సందర్భాలకు ప్రతిరూపం అన్నట్టు సినిమా ఉంది. 

పేకమేడలు సినిమా చూస్తుంటే బస్తీల్లోని ఇళ్లల్లో జరిగే విషయాలను దర్శకుడు అంత అద్భుతంగా ఎలా క్యాప్చర్ చెయ్యగలిగారని ఆశ్చర్యం కలుగుతుంది. హీరో హీరోయిన్లతో పాటు మిగతా క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చెయ్యడం కోసం కొంత టైమ్ తీసుకున్నారు. కానీ, కామెడీతో బోర్ కొట్టకుండా రన్ చేశారు. ఒక్కసారి బి భర్త చేసే పనులు భార్యకు తెలిసిన తర్వాత సినిమా ఆగలేదు. పరుగులు పెట్టింది. యాక్షన్ లేదు, కామెడీ లేదు, కానీ ఆ ఎమోషనల్ సీన్లు వస్తుంటే రెప్ప వెయ్యకుండా మూవీ చూసేలా ఉంటుంది. క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కడ అనూష క్రిష్ణ నటన సైతం అద్భుతం. పేకమేడలు ప్రారంభం నిదానంగా మొదలైన ఆ ఫీలింగ్ థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఉండదు. క్లైమాక్స్ ఇచ్చిన హైతో బయటకు వస్తాం. ఆడియన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా.

రేటింగ్: 2.5/5

Peka Medalu Review:

Peka Medalu Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement