Advertisement
Google Ads BL

తెలుగు సినిమా అభివృద్ధికి చంద్రబాబు ప్రణాళిక


ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరపడటానికి ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి ఎన్. చంద్ర బాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతి లోని సచివాలయంలో నిర్మాత కె. ఎస్. రామారావు మంగళవారం రోజు చంద్ర బాబు నాయుడు గారిని కలసినప్పుడు సినిమా రంగం గురించి పలు అంశాలను చర్చించారు. 

Advertisement
CJ Advs

స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించిన తెలుగు దేశం పార్టీతో సినిమా రంగానికి విడతీయలేని అనుబంధం వుంది. మద్రాసు నుంచి తెలుగు సినిమాను హైదరాబాద్ తరలించడానికి ఎన్.టి.ఆర్ ఎంతో కృషి చేశారు. రామారావు గారి తరువాత ముఖ్య మంత్రిగా అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు కూడా అదే విధానాలను అనుసరించి సినిమా రంగానికి సంపూర్ణ సహకారాన్ని అందించారు. 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా గత నెల చంద్ర బాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తరువాత మార్యాద పూర్వకంగా కె. ఎస్. రామారావు కలసినప్పుడు సినిమా రంగం స్థిరపడానికి ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్న విషయం పై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి సినిమా రంగం ఏమేమి ఆశిస్తుందో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు రామారావుతో చర్చించారు. 

సీనియర్ నిర్మాత అయిన రామారావు సలహాలు సూచనలు చంద్ర బాబు తీసుకున్నారు. సినిమా రంగం గురించి త్వరలోనే ప్రభుత్వం సమగ్రమైన ప్రణాలికను ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారితో ఆంధ్ర ప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందటానికి  తీసుకోవలసిన చర్యల గురించి ఫలవంతమైన చర్చ జరిగిందని, చంద్ర బాబు నాయుడు గారికి సినిమా రంగం పట్ల అవగాహన, స్పష్టంగా ఉందని, బాబు గారి మార్గదర్శకత్వంలో తెలుగు సినిమా పరుగులు తీస్తుందని ఈ సందర్భంగా కె. ఎస్. రామారావు తెలిపారు.

CM Chandrababu Plan for the Development of Telugu Cinema:

Chandrababu Nayudu plan for the development of Telugu cinema
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs