Advertisement
Google Ads BL

డల్లాస్ లో VN ఆదిత్య కొత్త సినిమా ఆడిషన్స్


వీఎన్‌ ఆదిత్య.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని దర్శకుడు. మనసంతా నువ్వే, శ్రీరామ్,  నేనున్నాను వంటి సూపర్ హిట్  చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే.. మంచి ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ, లేదంటే కమర్షియల్‌ హంగులతో ఉన్న సందేశాత్మక చిత్రం అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. కుటుంబంతో కలిసి చూసే విధంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వీఎన్‌ ఆదిత్య గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలను డైరెక్ట్‌ చేస్తూ వచ్చిన వీఎన్‌ ఆదిత్య.. గత కొంత కాలంగా వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలు కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే వీఎన్‌ ఆదిత్య సినిమాలకు సంబంధించి మరో కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. త్వరలోనే వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతుంది. 

Advertisement
CJ Advs

ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా.. వీఎన్‌ ఆదిత్య డైరెక్షన్‌లో కొత్త సినిమా రాబోతున్నట్లు.. చిత్ర బృందం ప్రకటించారు. ఈ మేరకు జూలై 7, ఆదివారం నాడు.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో లో లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో కొత్త సినిమాపై ప్రకటన చేశారు. వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో వచ్చే ఈ కొత్త మూవీ నిర్మాణం డల్లాస్‌లో జరగనుందని.. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్తుందని మేకర్స్‌ తెలిపారు. అయితే సినిమాకు సంబంధించి తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు మాత్రమే కాక.. విదేశీయులు అనగా అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, ఇండియన్స్‌.. మరీ ముఖ్యంగా తమిళ్‌, కన్నడ, తెలుగు వారు భారీ సంఖ్యలో ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతూ.. ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. దీనిపై దర్శకుడు వీఎన్‌ ఆదిత్య తన హర్షం వ్యక్తం చేశారు. ఇక వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతుందని తెలియడంతో ఆయన అభిమానులు మాత్రమే కాక మూవీ లవర్స్‌ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్‌ గుడ్‌ మూవీస్‌కు కెరాఫ్‌ అడ్రెస్‌ అయిన వీఎన్‌ ఆదిత్య డైరెక్షన్‌లో సినిమా అంటే.. కచ్చితంగా సున్నితమైన భావోద్వేగాలకు పెద్దపీట వేస్తారని ప్రేక్షకులు నమ్ముతున్నారు. దేశం కాని దేశంలో ఓ తెలుగు సినిమా ఆడిషన్ కి ఇంతటి రెస్పాండ్ రావడానికి కూడా ఇదే కారణం.మరి.. ఈ అంచనాలను అందుకుంటూ వీ.ఎన్. ఆదిత్య ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి,  ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి, శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు,  కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి,  శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

VN Aditya New Movie Auditions:

VN Aditya new movie auditions in Dallas received a great response
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs