Advertisement
Google Ads BL

భజే వాయు వేగం ఓటీటీ డేట్ వచ్చేసింది


హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన భజే వాయు వేగం సినిమా గత నెల 31న థియేటర్స్ లో రిలీజై హిట్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీ లవర్స్ ముందుకు వచ్చేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో భజే వాయు వేగం సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా హీరో కార్తికేయ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ – థియేటర్స్ లో మా భజే వాయు వేగం సినిమాకు ప్రేక్షకులంతా తమ ప్రేమను అందించారు. అదే ప్రేమను మేము నెట్ ఫ్లిక్స్ ద్వారా మీ ఇంటికే వచ్చి తిరిగి ఇవ్వబోతున్నాం. అని ట్వీట్ చేశారు.

భజే వాయు వేగం సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. 

Bhaje Vaayu Vegam to arrive on Netflix :

Bhaje Vaayu Vegam to arrive on Netflix on June 28th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs