Advertisement
Google Ads BL

ఆర్డీనరిగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ నాగి


ముంబయి లో గ్రాండ్ గా జరిగిన ప్రభాస్ కల్కి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్

Advertisement
CJ Advs

కల్కి లో నేను పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్…అమితాబ్ బచ్చన్

కల్కి ఎక్స్పీరియన్స్ ను ఎప్పటికీ మర్చిపోలేను….అమితాబ్ బచ్చన్

డైరెక్టర్ నాగ అశ్విన్ కల్కి ని అద్భుతంగా తీశాడు….కమల్ హాసన్

అమితాబ్ సర్ కమల్ సర్ లాంటి గ్రేట్ లెజెండ్స్ తో వర్క్ చేయడం ఇట్స్ బిగ్గర్ దేన్ డ్రిమ్….ప్రభాస్

కల్కి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కంప్లిట్ న్యూ వరల్డ్ …దీపిక పదుకొనె

ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. కల్కి 2898 AD లో పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్. ట్రూలీ వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఇది ఓ కొత్త ప్రపంచం. ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి సినిమాని అలోచించిన నాగ్ అశ్విన్ కి, టీం అందరికీ అభినందనలు. నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఏం డ్రింక్ చేస్తే ఇలాంటి కథని అలోజించగలిగాడనిపించింది. ఇందులో వున్న విజువల్స్ అన్ బిలివబుల్. ఇలాంటి ఫ్యుచరిస్టిక్ ప్రాజెక్ట్ ని తీయడం మహా అద్భుతం. తను అనుకున్న విజన్ ని వండర్ ఫుల్ గా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. కల్కి ఎక్స్ పీరియన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు     

ఉలగ నాయగన్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్ మా గురువు గారు బాలచందర్ గారిలా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు నాగ్ అశ్విన్ కి వుంది. ఇందులో బ్యాడ్ మ్యాన్ గా ప్లే చేస్తా.  ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి  కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు అన్నారు  

రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దత్తు గారు, నాగీ గారికి థాంక్ యూ. ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం. అమితాబ్ గారు కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ గారి లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి కడుపులో క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. అలాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం అన్ బిలివబుల్. అలాగే దీపిక ఇంటర్నేషనల్ లెవల్ కి రీచ్ అయిన స్టార్. దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్ యూ అన్నారు.

హీరోయిన్ దీపికా పదుకొనే మాట్లాడుతూ.. కల్కి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కంప్లీట్ న్యూ వరల్డ్. డైరెక్టర్ నాగీ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇది. యాక్టర్ గా ప్రొఫెషనల్  గా ఇది అద్భుతమైన ఎక్స్ పీరియన్స్. నాగీ జీనియస్. తన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. సినిమాని అద్భుతంగా తీశారు అన్నారు  

ప్రొడ్యూసర్ అశ్విని దత్ మాట్లాడుతూ.. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్, దీపిక నలుగురూ ఇక్కడ వుండటం, అందరి సమక్షంలో ఈ ఈవెంట్ జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. కల్కి 2898 AD యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Its a great honour to be a part of this film:

Kalki 2898 AD pre release event in Mumbai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs