Advertisement
Google Ads BL

పుష్ప డేట్ ని లాక్ చేసిన ఉస్తాద్ రామ్


ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌తో తిరిగి వస్తున్నారు. మేకర్స్ ఈరోజు సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అంటే అల్లు అర్జున్ పుష్ప ద రూల్ రిలీజ్ డేట్ కి థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.  

Advertisement
CJ Advs

అంటే పుష్ప 2 ఆగష్టు 15 నుచి తప్పుకోనుండడంతో డబుల్ ఇస్మార్ట్  మేకర్స్ ఈ డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేసేసారు. సినిమా విడుదలకు  ఇండిపెండెన్స్ డే పెర్ఫెక్ట్ టైమ్. గురువారం సెలవు కాగా, సోమవారం (రక్షాబంధన్) మరో హాలీ డే కూడా సినిమాకు కలిసిరానుంది. పవర్ ఫుల్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ పవర్-ప్యాక్డ్ అవతార్‌లో విభూతి ధరించి కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో ఒక శివలింగం, కాగడ ని చూడవచ్చు.

ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు వస్తారు.యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ప్రీక్వెల్‌కి డబుల్ ఇస్మార్ట్ సినిమా డబుల్ మ్యాడ్ నెస్ తో ఉండబోతుంది. పూరి జగన్నాధ్ మరోసారి తన హీరోని బెస్ట్  స్టైలిష్, మాస్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు.

రామ్ డబుల్ ఇస్మార్ట్‌ని డబుల్ స్కిల్స్ తో అదరగొట్టారు. సంజయ్ దత్ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్.

డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

 

Double ISMART Theatrical Release For Independence Day :

Double ISMART Theatrical Release For Independence Day On August 15
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs