Advertisement
Google Ads BL

విశ్వంభరలోకి మరో కమాండింగ్ పర్సనాలిటీ


మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ విశ్వంభర మేకర్స్ ఒక్కో అనౌన్స్ మెంట్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

Advertisement
CJ Advs

విశ్వంభరతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకుడు వశిష్ట అన్నీ క్రాఫ్ట్స్ లో చాలా కేర్ తీసుకుంటున్నారు. విశ్వంభర టీమ్ ఇప్పుడు కమాండింగ్ పర్సనాలిటీ కునాల్ కపూర్ ను ఈ మ్యాజిస్టిక్ వరల్డ్ కి స్వాగతించింది. రంగ్ దే బసంతి, డాన్ 2, డియర్ జిందగీ మొదలైన అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించిన కునాల్ కపూర్ విశ్వంభరలో పవర్ ఫుల్ పాత్ర కోసం ఎంపికయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు కునాల్ కు ఇది గొప్ప అవకాశం.

విశ్వంభరలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

Team Vishwambhara Welcomes Kunal Kapoor:

Team Vishwambhara Welcomes The Man With A Commanding Personality, Kunal Kapoor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs