Advertisement
Google Ads BL

కల్కి 2898 AD కౌంట్‌డౌన్ బిగిన్స్ !


మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ ఫిక్షన్ ఎపిక్ కల్కి 2898 AD భారీ అంచనాలతో కూడిన ట్రైలర్ విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, మేకర్స్ మూవీపై వున్న ఎక్సయింట్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెలుతున్నారు. ఈరోజు, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అశ్వత్థామ అవతార్ లోఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. అమితాబ్ యుద్దభూమి మధ్యలో నిలబడి, అస్త్రాన్ని పట్టుకుని, నుదిటిపై ఒక దివ్య రత్నాన్ని ధరించి, యుద్ధానికి సిద్ధంగా వున్నట్లుగా కనిపించారు. అతని వెనుక ఒక లైఫ్ సైజు వెహికిల్ తో పాటు కొంతమంది వ్యక్తులు నేలపై పడివుండటం గమనించవచ్చు.

Advertisement
CJ Advs

అతని నిరీక్షణ ముగుస్తోంది... మూడు రోజుల్లో #Kalki2898AD ట్రైలర్, జూన్ 10న విడుదల అని సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్.  

అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర మధ్యప్రదేశ్‌లోని నెమావార్, నర్మదా ఘాట్ వద్ద ఒక మ్యాసీవ్ ప్రొజెక్షన్ ద్వారా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నెమవార్, నర్మదా ఘాట్‌ల ఎంచుకోవడం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఎందుకంటే అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా మైదానంలో నడుస్తాడని నమ్ముతారు. ఈ మూవీ, తన పాత్ర కోసం అభిమానుల్లో మరింత ఎక్సయిట్మెంట్ పెంచింది.

కల్కి 2898 AD లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 

Ashwatthama in the new Kalki 2898 AD Poster:

Amitabh Bachchan looks ready to battle as Ashwatthama in the new Kalki 2898 AD Poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs