Advertisement
Google Ads BL

పుష్ప 2: సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే..


పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు.. 

Advertisement
CJ Advs

ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ పుష్పకు కంటిన్యూగా రాబోతోన్న పుష్ప 2: ది రూల్ పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే.. పుష్ప ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న పుష్ప 2: ది రూల్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పుష్ప పుష్ప సాంగ్ యూట్యూబ్‌లో ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పగా.. ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప 2: ది రూల్ నుంచి కపుల్ సాంగ్ సూసేకి  అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ వదిలారు. 

ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన చిన్న ప్రోమో ఎలా వైరల్ అయిందో తెలిసిందే. మేకింగ్ విజువల్స్‌తో వచ్చిన ఈ కపుల్ సాంగ్.. నా సామి పాటను బీట్ చేసేలా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. అంతకుమించి అనేలా ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు.

వీడు మొరటోడు

అని వాళ్లు వీళ్లు.. ఎన్నెన్ని అన్న

పసిపిల్లవాడు నా వాడు..

వీడు మొండోడు

అని ఊరు వాడ అనుకున్నగానీ

మహరాజు నాకు నా వాడు..

ఓ.. మాట పెలుసైనా.. మనసులా వెన్న

రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నా.. కన్నా..

సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ..

మెత్తానీ పత్తిపువ్వులామరి సంటోడే నా సామీ

ఓ.. ఎర్రబడ్డ కళ్లలోన కోపమే మీకు తెలుసు..

కళ్లలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు..

కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు..

మీసమెనుక ముసురుకున్న మూసి నవ్వు నాకు తెలుసు

అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే మీకు తెలుసు

అలసిన రాతిరి ఒడిలో చేరి తలవాల్చడమే శ్రీ.. వల్లికి తెలుసు

సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ..

మెత్తానీ పత్తిపువ్వులామరి సంటోడే నా సామీ

ఓ.. గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు..

నన్ను మాత్రం చిన్ని చిన్న ముద్దులడిగే గరీబు..

పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు..

వాడి చొక్కా ఎక్కడుందో.. వెతకమంటాడు చూడు..

బయిటికి వెళ్లి ఎందరెందరినో ఎదురించేటి దొరగారు

నేనే తనకి ఎదురెళ్లకుండా బయటికి వెళ్లరు శ్రీ..వా..రు

సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామే..

ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైనా మహరా..ణే’ వంటి అద్భుతమైన సాహిత్యంతో వచ్చిన ఈ పాటను 5 భాషల్లోనూ ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాడటం మరో విశేషం. ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్‌తో దుమ్మురేపారనేది అర్థమవుతోంది. ఈ పాటతో పుష్ప 2: ది రూల్ క్రేజ్ డబులైంది. 

Pushpa: The Rule Second Single out:

Pushpa: The Rule Second Single: Sooseki is the ultimate Couple Song!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs