Advertisement
Google Ads BL

కన్నప్ప: ప్రభాస్ పాత్రపై విష్ణు మంచు కామెంట్స్


డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్ అడుగు పెట్టిన విషయం విధితమే. ఇక విష్ణు మంచు తన కన్నప్ప సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ఇన్ స్టాగ్రాం ఖాతా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఏముందంటే..

Advertisement
CJ Advs

కన్నప్ప నుంచి న్యూస్ ఎప్పుడు వచ్చినా అందరూ ఆత్రుతగా చూస్తుంటారు. గత ఐదారు అప్డేట్లు ఇచ్చినప్పుడు కన్నప్ప టాప్‌లో ట్రెండ్ అయింది. నా మిత్రుడు ప్రభాస్ షూట్‌లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. దాదాపు 18 గంటల పాటు సోషల్ మీడియాలో ఆ వార్త ట్రెండ్ అయింది. కన్నప్పలో మహామహులు నటిస్తున్నారు. ఈ కథలో చాలా గొప్ప పాత్రలున్నాయి. ఆ పాత్రలను అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్‌కి, డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం ఈ విషయం చెబుతున్నాను. కన్నప్ప సినిమాను నేను చేస్తున్నా..నువ్వు ఒక కారెక్టర్ చేయాలని ప్రభాస్‌కు చెప్పాను. ‘కథ బాగా నచ్చింది నాకు ఈ పాత్ర ఇంకా బాగా నచ్చింది.. ఈ కారెక్టర్‌ను నేను చేయొచ్చా? అని ప్రభాస్ అడిగారు. ఏ కారెక్టర్‌ అయితే ప్రభాస్‌కు బాగా నచ్చిందో అదే పాత్రను ప్రభాస్ పోషించారు. ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తాను. అధికారికంగా ఆ పాత్రలను గురించి మేం చెప్పినప్పుడే నమ్మండి. బయట వచ్చే వాటిని నమ్మకండి. త్వరలోనే అన్ని పాత్రల గురించి ప్రకటిస్తాం. సోమవారం నాడు మీకు అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నాము అని అన్నారు.

An Exciting Update From Kannappa On May 13:

An Exciting Update From Kannappa On May 13, Announces Vishnu Manchu 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs