Advertisement
Google Ads BL

VD పాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్


స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ చిత్రమిది. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది.

Advertisement
CJ Advs

ఈ రోజు విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాను ప్రకటించారు. అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ కత్తి పట్టుకుని, వయలెంట్ మోడ్ లో ఉన్నట్లు చూపించారు. కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే.. అనే క్యాప్షన్ రాశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు తెలియజేయనున్నారు.

VD-Dil Raju-Ravi Kiran Kola poster is intriguing:

Vijay Devarakonda-Dil Raju-Ravi Kiran Kola project concept poster unveiled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs