Advertisement
Google Ads BL

విశ్వంభర మ్యాసీవ్ ఇంటర్వెల్ సీన్ అప్ డేట్


మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ ప్రపంచంలోని కథాంశంతో అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయిక.

Advertisement
CJ Advs

ప్రస్తుతం టీమ్, టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాష్ నిర్మించిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన హ్యుజ్ సెట్‌లో మ్యాసీవ్ స్టంట్ సీక్వెన్స్‌ను అత్యద్భుతంగా చిత్రీకరిస్తోంది. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని పర్యవేక్షిస్తున్నారు. చిరంజీవి, ఫైటర్స్ మధ్య ఉత్కంఠభరితంగా రూపొందించిన ఈ ఫైట్‌తో ఇంటర్వెల్ బ్లాక్ బ్యాంగ్-ఆన్ కానుంది. 

ఈ సీక్వెన్స్ ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా 26 వర్కింగ్ డేస్‌లో చిత్రీకరించబడింది. మెగాస్టార్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని వర్కింగ్ డేస్ కేటాయించడం ఇదే అత్యధికం. ఈ సీక్వెన్స్ షూటింగ్ నేటితో పూర్తవుతుంది. ఈ హైవోల్టేజ్ యూనిక్ యాక్షన్ బ్లాక్ అభిమానులు, మాసెస్ ను  థియేటర్‌లలో మెస్మరైజ్ చేయనుంది.  

Vishwambhara Massive Interval Stunt Sequence Filmed Outstandingly :

Vishwambhara Massive Interval Stunt Sequence Filmed Outstandingly For 26 Days
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs