Advertisement
Google Ads BL

ఫిలిమ్ నగర్ లో చంద్ర బాబు జన్మదినోత్సవం


తెలుగు దేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో శనివారం రోజు జరిగాయి.

Advertisement
CJ Advs

సీనియర్ జర్నలిస్ట్ కొండపనేని ఉమామహేశ్వర రావు కుమారుడు యశ్వంత్, కోడలు విజితల కుమార్తె తన్మయి కృష్ణ పుట్టినరోజు వేడుకలలో భాగంగా చంద్ర బాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి రామకృష్ణ కేక్ కట్ చేశారు.

ఈ వేడుకల్లో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు ఆదిశేషగిరి రావు, నిర్మాతలు కె. ఎస్. రామారావు, పోకిరి బాబు రావు, డి. వి. కె. రాజు, తుమ్మల ప్రసన్న కుమార్, కాజా సూర్యనారాయణ, ముళ్ళపూడి మోహన్, సీనియర్ జర్నలిస్టులు భగీరథ, వెంకటేశ్వర రావు, మిద్దె శ్రీరామ్ రెడ్డి, పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన, బిజెపి కూటమి విజయం సాధించాలని, చంద్ర బాబు ముఖ్యమంత్రి కావాలని మోహన్ కృష్ణ, రామకృష్ణ, రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్ర బాబు పై రూపొందించిన పాటను ప్రదర్శించారు.

Chandrababu Birthday in Film Nagar:

Chandrababu Naidu s birthday in Film Nagar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs