Advertisement
Google Ads BL

యోదా డయాగ్నోస్టిక్స్ ని ప్రారంభించిన చిరు


సుప్రసిద్ధ నటులు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, మాదాపూర్ లో యోదా డయాగ్నొస్టిక్స్ కొత్త బ్రాంచ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోదా అధినేత కంచర్ల సుధాకర్ ను మంత్రి దామోదర్ రాజ నరసింహ ఒక ప్రశ్న అడిగారు, ఈ డయాగ్నొస్టిక్ సెంటర్ చాలా ఆధునికతగా ఉంది కదా, మరి ఇది పేద వారికి ఎంత వరుకు ఉపయోగపడుతుంది అని? దానికి సమాధానం గా చిరంజీవి స్టేజి పై ఇలా చెప్పారు.

Advertisement
CJ Advs

చిరంజీవి మాట్లాడుతూ: కంచర్ల సుధాకర్ నాకు తమ్ముడు లాంటి వాడు, ఆయన గతంలో అమీర్ పేట లో యోదా బ్రాంచ్ ప్రారంభించినప్పుడు నేను అడిగాను, అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఈ యోదా డయాగ్నొస్టిక్ సెంటర్ పేద ప్రజలకు, మా సినిమా కార్మికులకు ఎంత వరుకు ఉపయోగపడుతుంది అని? దానికి కంచర్ల సుధాకర్ ఇలా అన్నారు అన్నయ్య మన సినిమా వారి అందరికి హెల్త్ కార్డు ఇస్తాను, అవి చూపిస్తే వారికి అతి తక్కువ ధరలకే ఇక్కడ ఉన్న అన్ని టెస్టులు చేయించుకోవచ్చు అని. ఆ మాటలకి నాకు ఎంతో స్ఫూర్తి కలిగి, నా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని యోదా డయాగ్నొస్టిక్ తో అనుసంధానం చేసి 14,000 మంది సినీ కార్మికులకు వారి కుటుంబాలకు హెల్త్ కార్డ్స్ ని మంజూరు చేశాము. 

ఇప్పుడు ఈ మాదాపూర్ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా యుట్యూబర్స్, ఇన్ఫ్లుఎన్సర్స్ కి కూడా హెల్త్ కార్డ్స్ మంజూరు చేస్తున్నాం. అని చెప్పి చిరంజీవి స్వయానా ఆయన చేతుల మీదగా హెల్త్ కార్డ్స్ మంజూరు చేశారు. కంచర్ల సుధాకర్ లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారని, ఒక పక్క వ్యాపారం ఇంకో పక్క ఉదాసీనత రెండు చాటుకోవడం చాలా రేర్ కాంబినేషన్ అని కొనియాడారు.

Chiranjeevi Inaugurates Yoda Diagnostics New Branch :

Chiranjeevi Inaugurates Yoda Diagnostics New Branch in Madhapur
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs