Advertisement
Google Ads BL

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో భార‌తీయుడు 2


ఇండియ‌న్ సినీ రంగంలో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి చెప్పాలంటే క‌మర్షియ‌ల్‌గా భారీ చిత్రాల‌ను అద్భుతం అని అంద‌రూ మెచ్చుకునేలా తెర‌కెక్కించ‌టంలో సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్ద‌రూ చేతులు క‌లిపారంటే అద్భుత‌మైన సినిమా మ‌న ముందుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. భార‌తీయుడు (ఇండియ‌న్‌) సినిమాతో అది నిరూపిత‌మైంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి భార‌తీయుడు 2తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాయ చేయ‌బోతున్నారు. భార‌తీయుడు బ్లాక్ బస్ట‌ర్ త‌ర్వాత వీరిద్ద‌రూ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. 

Advertisement
CJ Advs

అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా భార‌తీయుడు చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ తిరుగులేని విజ‌యాన్ని సాధించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా భార‌తీయుడు 2 రానుండ‌టంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. గ్రిప్పింగ్ క‌థ‌నంతో ఈ మూవీ మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు స‌హా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  

భార‌తీయుడు 2 సినిమాపై ముందు నుంచి భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. దానికి అనుగుణంగానే ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో  సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన శంక‌ర్ ఇప్పుడు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌టంపై దృష్టి సారించారు. మే నెలాఖ‌రున ప‌వ‌ర్‌ప్యాక్డ్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూన్‌లో భారీ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

భార‌తీయుడు 2 సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి, మూవీ ఎలా ఉండ‌బోతుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో జీరో టాల‌రెన్స్‌ లైన్ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Bharateeyudu2 with Kamal Haasan finish shoot:

Bharateeyudu2 (Indian2) with Universal Star Kamal Haasan finish shoot, post-production in full sing
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs