Advertisement
Google Ads BL

అఫీషియల్: RC 17 అనౌన్స్


రంగా రంగా రంగ‌స్థ‌లాన అంటూ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్న రంగ‌స్థ‌లం కాంబినేష‌న్ మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి సిద్ధ‌మైంది. మెగా సైన్యం, మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడు, ఇంకెప్పుడు అని ఎదురుచూస్తున్న సినిమా ప్ర‌క‌ట‌న రానే వ‌చ్చేసింది. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, మేవ‌రిక్ డైర‌క్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీస్ మేక‌ర్స్ సంస్థ మరియు సుకుమార్ రైటింగ్స్ అత్యంత భారీ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

Advertisement
CJ Advs

గ్రౌండ్ బ్రేకింగ్ కొలాబ‌రేష‌న్‌కి రంగం సిద్ధ‌మైంది అంటూ త‌మ సినిమా గురించి అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది మైత్రీ మూవీ మేక‌ర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్.  రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా స్క్రిప్ట్ తీర్చిదిద్దారు సుకుమార్‌. 

బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ ట్రిపుల్ ఆర్ త‌ర్వాత గ్లోబ‌ల్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు రామ్‌చ‌ర‌ణ్‌. ఇటు పుష్ప సినిమాతో త‌గ్గేదేలే అంటూ అంద‌రివాడ‌నిపించుకున్నారు మూవీ మాస్ట‌ర్ సుకుమార్‌. 

వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మీద మ‌న ద‌గ్గ‌రే కాదు, దేశ వ్యాప్తంగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి.

వాట‌న్నిటినీ అందుకునేలా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు సుకుమార్‌. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొద‌లుపెడ‌తారు. 2025 లాస్ట్ క్వార్ట‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ కాంబినేష‌న్‌కి రాక్‌స్టార్‌, మ్యూజిక్ సెన్సేష‌న్ దేవిశ్రీ ప్ర‌సాద్ పేరు తోడ‌వ‌డం అభిమానుల్లో మ‌రింత ఉత్సాహాన్ని పెంచేస్తోంది. రంగ‌స్థ‌లం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ కాంబినేష‌న్ మ‌రోసారి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ తో రెడీ అవుతోంది. 

ఇంత‌మంది హేమాహేమీలు క‌లిసి రూపొందిస్తున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమాటిక్ ఎక్స్  పీరియ‌న్స్ ని నెవ‌ర్ బిఫోర్ అన్న‌ట్టు క‌లిగించ‌నుంది. సో... గెట్ రెడీ!

Sukumar and Ram Charan for His Next Magnum Opus!:

Director Sukumar and Mythri Movie Makers Rope in Global Star Ram Charan for His Next Magnum Opus!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs