Advertisement
Google Ads BL

శక్తి ఫౌండేషన్‌ను ప్రారంభించిన శిల్పా రెడ్డి


మాజీ మిసెస్ ఇండియా శిల్పా రెడ్డి స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ అయిన రైజింగ్ శక్తి ఫౌండేషన్ను మార్చి 7న మేడ్చల్ లోని గాజులరామారంలో అధికారికంగా ప్రారంభించనున్నారు. కర్టెన్ రైజర్ ఈవెంట్లో 200 మందికి పైగా మహిళలు పాల్గొంటారు. మహిళలు, యువత సాధికారత దిశగా స్ఫూర్తిదాయక ప్రయాణం ప్రారంభం.

Advertisement
CJ Advs

మాజీ మిసెస్ ఇండియా, మోడల్,  ఫ్యాషన్ డిజైనర్  మరియు ఫిట్‌నెస్ వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన శిల్పా రెడ్డి ఈ రోజు తన లాభాపేక్షలేని సంస్థ రైజింగ్ శక్తి ఫౌండేషన్‌ను మహిళలు మరియు యువతకు సాధికారత కల్పించేందుకు ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ  ఫౌండేషన్ కాలక్రమేణా మహిళలు మరియు యువతకు  సాధికారత కల్పించటంతో పాటుగా గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా  వివిధ కార్యక్రమాలు ప్రారంభించనుంది. 

రైజింగ్ శక్తి ఫౌండేషన్ అనేది స్థిరమైన జీవన కార్యక్రమాల ద్వారా మహిళలు మరియు యువతకు సాధికారత కల్పించడానికి అంకితం చేయబడిన ఒక లాభాపేక్షలేని సంస్థ. విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకతపై దృష్టి సారించి, భవిష్యత్ తరాలకు మరింత స్థిరమైన మరియు సమానమైన అవకాశాలు కలిగిన  ప్రపంచాన్ని సృష్టించేందుకు ఫౌండేషన్ కట్టుబడి ఉంది. 

ముషీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ముఠా  గోపాల్ గారు 26 ఫిబ్రవరి 2024న ప్రారంభించిన ముషీరాబాద్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం SRD (సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్)కి 12 లక్షల విలువైన జిమ్ పరికరాలను విరాళంగా అందించడం ద్వారా RSF ఇప్పటికే తన గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించింది.

తన జీవితంలో ఈ ఫౌండేషన్  యొక్క ప్రాముఖ్యతను శిల్పా రెడ్డి వెల్లడిస్తూ , తన జీవిత ప్రయాణంలో, తాను  సంపూర్ణ జీవితం అనుభవించినట్లు అనిపిస్తుంది. సమాజానికి తిరిగి ఇవ్వడానికి ఇది సరైన సమయం  అని నేను భావిస్తున్నాను. విద్య మరియు ఉపాధి ద్వారా మహిళలకు స్వేచ్ఛ లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ ఫౌండేషన్ ద్వారా, మహిళలకు సాధికారత కల్పించడం, వారి జీవితాల్లో నైపుణ్యాలను జోడించడం మరియు వారిలో స్వేచ్ఛా  జ్యోతిని వెలిగించడం కోసం నేను అంకితభావంతో ఉన్నాను... అని అన్నారు. 

Shilpa Reddy started Shakti Foundation:

Shakti Foundation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs