మా ఈగల్ సినిమా ప్రచారంలో భాగంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా, నేను నా ప్రొడక్షన్ హౌస్ లో జరిగిన అవినీతి చర్యల వల్ల, సినిమాలలో క్వాలిటీ ఎలా దెబ్బ తింటోందో చెప్పాను.. ఆ అవినీతిని అరికట్టే ప్రయత్నంలో నేనెలాంటి ప్రతిచర్యలు చేపట్టాను అని మీడియా వారికి చెప్పడం జరిగింది.
దీనికి భుజాలు తడుముకున్న కొందరు పరిశ్రమ వ్యక్తులు, నా వ్యాఖ్యలు వక్రీకరించి, నేనేదో కార్మిక సంఘాల సభ్యులను, శ్రామికులను కించపరిచినట్టు దుష్ప్రచారం చేయడం నా దృష్టికి వచ్చింది.
పరిశ్రమలోని కొందరు వ్యక్తుల అవినీతి వల్ల, కష్టపడి పనిచేసే యూనియన్ కార్మికులకే నా డబ్బు అందడం లేదని నేనన్నాను..
నా కంపెనీ అంతర్గత వ్యవహారం గురించి నేను చేసిన వ్యాఖ్యలతో బయటి వారికి సంబంధమేమిటో నాకర్ధం కాలేదు.
నా సంస్థలో ఎవరికైనా జీతాలందకపోతే, వారు నేరుగా మాట్లాడి తీసుకుంటారు. యూనియన్ కి కంప్లైంట్ వస్తే ఛాంబర్ లో లేదా కౌన్సిల్ లో సాల్వ్ చేసుకుంటాం.
ఇష్టపడి సినిమా వ్యాపారంలోకి వచ్చాను. ఇంకొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం నాకు లేదు.
నా కంపెనీ లో అవినీతి కి పాల్పడని వారంతా గర్వంగా పనిచేయవచ్చు..
అవినీతి పరులపై నేను లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ నేను వారి కుటుంబాల గురించి ఆలోచించి వారిని వదిలేశాను.
అది నా స్వంత నిర్ణయం..
బయటి వారికి సంబంధం లేదు..
నేను తీసిన ముప్ఫైకి పైగా సినిమాల్లో మూడు లక్షలకు పైగా కార్మిక సోదరుల కష్టం ఉంది..
మరో పాతిక సినిమాలు సెట్ మీదకొస్తున్నాయి.
నేను యూనియన్ వర్కర్స్ కి వ్యతిరేకం కాదు.
వాళ్ల కష్టాన్ని, నా ధనాన్ని కలిపి దోచుకుంటున్న వారికి మాత్రమే..
I never succumb to any corrupted person..
Honesty prevails..
And cinema is bigger than any individual..
మీ
టీ.జీ.విశ్వ ప్రసాద్