Advertisement
Google Ads BL

రాబిన్‌హుడ్ గా నితిన్


హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్   భారీ స్థాయిలో రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కోసం రెండోసారి చేతులు కలిపారు. బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రోజునుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ రివీల్ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్.

Advertisement
CJ Advs

ఈ చిత్రానికి రాబిన్‌హుడ్ అనే టైటిల్ పెట్టారు. ఇండియన్స్ అందరినీ తన సోదరులు, సోదరీమణులుగా భావించి, వారి నుండి డబ్బు దొంగిలించడానికి తనకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పే నితిన్ పాత్రను పరిచయం చేస్తూ రివిల్ చేసిన టైటిల్ గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా వుంది.  

డబ్బు చాలా చెడ్డది... రూపాయి రూపాయి నువ్ ఏం చేస్తావ్ అంటే... అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అంటది.. అన్నట్టే చేసింది... దేశం అంతా కుటుంబం నాది... ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు... ఆభరణాలేసుకున్నోళ్లంతా నా అక్క చెల్లెళ్ళు...

అవసరం కొద్ది వాళ్ళ జేబుల్లో చేతులు పెడితే... ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు... అయినా నేను హర్ట్ అవ్వలేదు... ఎందుకంటే అయినవాళ్ల దగ్గర డబ్బులు తీయడం నా హక్కు...మై బేసిక్ రైట్. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ హ్యూమర్స్  డైలాగ్‌తో నితిన్ తనను తాను పరిచయం చేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.  

నితిన్  గెటప్ , యాక్షన్స్ చాలా ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. నితిన్ తన బ్యాగ్‌లో డబ్బు, బంగారంతో శాంతా క్లాజ్‌గా ఎంట్రీ ఇచ్చారు. తన బైక్ ముందుభాగంలో Im an Indian, వెనుకభాగంలో Im aware that I’m rare అని రాసుంది. తను డబ్బును ఒక రహస్య ప్రదేశంలో దాచిపెడతాడు.

నితిన్ స్టైలిష్ మేక్ఓవర్ లో మోడిష్ ఎటైర్ లో ఉబెర్ కూల్‌గా కనిపిస్తున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల సీరియస్‌ సన్నివేశాన్ని తనదైన శైలిలో వినోదాత్మకంగా చిత్రీకరించారు. తన మొదటి రెండు సినిమాల్లో రెండు విభిన్నమైన సబ్జెక్ట్‌లను ప్రయత్నించిన వెంకీ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. టైటిల్ టీజర్ కట్‌లో తన మార్క్ చూపించారు. కాన్సెప్ట్ వీడియో ఖచ్చితంగా ఒక యూనిక్ ఆలోచన. నితిన్‌ను సరికొత్త పాత్రలో ప్రజెంట్ చేశారు. టైటిల్ రివీల్ గ్లింప్స్ స్ట్రాంగ్  ఇంపాక్ట్ ని చూపుతుంది. ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా వుంది.

Nithiin, Venky Kudumula Film Titled Robinhood:

Nithiin, Venky Kudumula, Mythri Movie Makers Film Titled Robinhood, Intriguing Title Glimpse Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs