Advertisement
Google Ads BL

చిరుపై కోర్టుకెక్కిన మన్సూర్ కి లక్ష జరిమానా


నటుడు మన్సూర్ అలీఖాన్ టాప్ హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, త్రిషకు మద్దతు నిలిచిన సెలబ్రిటీస్ చిరంజీవి, కుష్బూలపై పరువునష్టం దావా వేసాడు. కానీ చివరికి ఈ కేసులో మన్సూర్ అలీఖాన్ కు కోర్టు భారీ జరిమానా వడ్డించింది. మన్సూర్ అలీఖాన్ త్రిషపై చేసిన దారుణమైన వ్యాఖ్యల పట్ల చిరంజీవి, కుష్బూ ఫైరవుతూ సోషల్ మీడియాలో త్రిషకు సంఘీభావం ప్రకటించారు. ఈ విషయమై మన్సూర్ అలీఖాన్ పరువు నష్టం కేసు పెట్టి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. చిరంజీవి, కుష్బూ తనను మాటలతో వేధించారని కోర్టులో మొసలి కన్నీరు కార్చాడు.

Advertisement
CJ Advs

తన పరువుకు భంగం కలిగించారని, వారిద్దరూ చెరొక కోటి రూపాయలు చెల్లించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరాడు. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు మన్సూర్ అలీఖాన్ వ్యాజ్యంపై మండిపడింది. పరువునష్టం దావా వేసినట్టు లేదు, పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది అంటూ అక్షింతలు వెయ్యడమే కాకుండా ఈ క్రమంలో మన్సూర్ అలీఖాన్  పిటిషన్ ను కొట్టివేసింది.

కోర్టు అంతటితో వదిలిపెట్టకుండా మన్సూర్ అలీఖాన్ కోర్టు సమయం వృథా చేశాడంటూ 1 లక్ష జరిమానా విధించింది. ఆ జరిమానాను మన్సూర్ అలీఖాన్ అడయార్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ కు చెల్లించాలని ఆదేశించింది. 

Madras High Court slaps fine on Mansoor Ali Khan:

Madras HC Slaps Rs 1 Lakh Fine On Mansoor Ali Khan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs