Advertisement
Google Ads BL

సలార్ ని రాజమౌళి వీక్షించేది అక్కడే


రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ సలార్- సీజ్ ఫైర్  విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డొమస్టిక్, ఓవర్సీస్ ప్రాంతాలలో గ్రౌండ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించడానికి సిద్ధంగా వుంది.  

Advertisement
CJ Advs

ప్రభాస్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బాహుబలి’ ని అందించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సలార్ ఫస్ట్ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. నైజాంలో సినిమాను విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ...ప్రైడ్ అఫ్ ఇండియన్ సినిమా. @ఎస్ఎస్ రాజమౌళి నైజంలో ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ #సలార్ ఫస్ట్ టిక్కెట్‌ను టీమ్, నిర్మాత #నవీన్ యెర్నేని నుండి కొనుగోలు చేసారు. @MythriOfficial ద్వారా నైజాం విడుదల. బుకింగ్‌లు భారీ వేడుకలతో అతి త్వరలో గ్రాండ్ గా ఓపెన్ అవుతాయి అని తెలియజేశారు

మేకర్స్ షేర్ చేసిన ఫోటోలో రాజమౌళి తో పాటు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్, మైత్రీ నవీన్ యెర్నేని, హోంబలే  ఫిలిమ్స్ విజయ్ కిరంగదూర్‌ వున్నారు.  

హైదరాబాద్ RTC X రోడ్స్‌లోని సంధ్య 70 MMలో 7 AM షో కోసం రాజమౌళి టిక్కెట్‌ను కొనుగోలు చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ నైజాం అంతటా రికార్డ్ స్థాయి సెంటర్లలో సలార్ రిలీజ్ చేస్తున్నారు.

శృతి హాసన్, జగపతి బాబు ఇతర ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న గ్రాండ్ గా విడుదల కానుంది.

SS Rajamouli Purchased The First Ticket Of Prabhas Salaar :

SS Rajamouli Purchased The First Ticket Of Rebel Star Prabhas Most-awaited Pan India Film Salaar in Nizam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs