Advertisement
Google Ads BL

నా సామిరంగలో అంజిగా అల్లరి నరేష్‌ గ్లింప్స్


నాగార్జున అక్కినేని రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్‌తో కూడిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ నా సామిరంగతో రాబోతున్నారు. ఫస్ట్- టైమర్ విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్రెండ్ షిప్ కి కూడా ఇంపార్టెన్స్ వుంది. సినిమాలోని ఆ లేయర్ ని ఒక గ్లింప్స్ ద్వారా రివిల్ చేశారు.

Advertisement
CJ Advs

అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు, అంజి పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఇది కేవలం పాత్రను పరిచయం చేయడానికే కాదు, అల్లరి నరేష్‌తో నాగార్జునకు ఉన్న రిలేషన్ ని చాలా అద్భుతంగా చూపించింది. గ్లింప్స్ ని చూస్తే నరేష్, నాగార్జునతో స్నేహపూర్వక సంబంధాన్ని పంచుకునే సరదా వ్యక్తిగా కనిపించారు. మాటొచ్చేత్తది అనేది తను తరుచుగా వాడే మాటే. ఇది మాటమీద నిలబడే వ్యక్తిగా అతని పాత్రను సూచిస్తుంది.

నాగార్జున, అల్లరి నరేష్‌లను కలిసి చూడటం కనుల పండువగా ఉంటుంది. అల్లరి నరేష్  సినిమాకు పెద్ద వాల్యూ అడిషన్. శివేంద్ర దాశరధి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపించగా, ఎంఎం కీరవాణి తన ఆకర్షణీయమైన సంగీతంతో విజువల్స్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చారు. గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టీజర్‌ను త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Meet Allari Naresh As Anji:

Meet Allari Naresh As Anji in Naa Saami Ranga
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs