Advertisement
Google Ads BL

రానా-తేజ కాంబోలో రాక్షస రాజా


పవర్‌హౌస్ యాక్టర్ రానా, క్రియేటివ్ డైరెక్టర్ తేజ వారి కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రాక్షస రాజాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.

Advertisement
CJ Advs

గ్రిప్పింగ్ కథనం, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో గొప్ప ప్రశంసలను పొందిన ఈ పవర్ ఫుల్ కాంబో రీయూనియన్ కోసం అభిమానులు, క్రిటిక్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. వారి అంచనాలకు తగ్గట్టుగా రాక్షస రాజా ఇదివరకూ ఎన్నడూ చూడని క్రైమ్ వరల్డ్ ని ఎక్స్ ఫ్లోర్ చేస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్ , ఫ్యామిలీ డ్రామా అద్భుతమైన సమ్మేళనం ఉండబోతుందని ప్రామిస్ చేస్తోంది.

రానా పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ను పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇందులో రానా తన భుజంపై భారీ తుపాకీని పట్టుకుని మరో భుజంపై బుల్లెట్లతో కనిపించారు. విభూతి, తిలకం ధరించి, నోటిలో సిగార్‌తో వైల్డ్ గా కనిపించారు. వేళ్లకు రెండు పొడవాటి బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఓవరాల్ గా రానా లుక్ అద్భుతంగా అలరిస్తోంది.

ఈ గ్యాంగ్‌స్టర్‌ చిత్రంలో మునుపెన్నడూ లేని విధంగా సినిమాటిక్ జర్నీని ప్రేక్షకులు ఆశించవచ్చు. గ్రిప్పింగ్ కథనం, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, వండర్ ఫుల్ విజువల్స్ తో  రాక్షస రాజా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అభిమానులు అంచనాలను మించి సినిమా అద్భుతంగా ఉండబోతుంది.  

Rana Daggubati - Teja Combo Rakshasa Raja :

Rakshasa Raja First Look Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs