Advertisement
Google Ads BL

విశాల్ రత్నం టైటిల్ ఫస్ట్ షాట్


మాస్ హీరో విశాల్ కొత్త సినిమా రత్నం. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి హరి దర్శకత్వం వహించారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ ప్యాండన్ సహ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌తో పాటుగా, ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

ఈ ఫస్ట్ షాట్ టీజర్ ప్యూర్ గూస్ బంప్స్ స్టఫ్‌లా అనిపించింది. ఆ బ్యాక్ డ్రాప్, ఆ సెటప్, దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్, కత్తితో తల నరికేయడం, విశాల్ మాస్ అవతారం ఇలా అన్నీ కలిసి ఈ ఫస్ట్ షాట్ టీజర్‌ను అద్భుతం అనేలా చేశాయి. కన్నీరే నెత్తురు చిందగా.. క్రోదమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే మాటలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.

తలని నరికిన రక్తంతో టైటిల్ పేరు రావడం, ఆ రక్తమే రత్నం అనే టైటిల్‌గా మారడం మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. 

Vishal, Hari Vishal34 Titled Rathnam:

Rathnam First Shot Unveiled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs