Advertisement
Google Ads BL

డబుల్ ఇస్మార్ట్‌ కి 100 రోజుల కౌంట్ డౌన్


పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్‌ ని పరుగులు పెట్టిస్తున్నారు.  ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో కీలక పాత్రల్లో నటిస్తున్న నటులు పాల్గొంటున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. 

Advertisement
CJ Advs

డబుల్ ఇస్మార్ట్‌ మార్చి 8, 2024న మహా శివరాత్రికి ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీని స్పష్టం చేయడానికి మేకర్స్ వందరోజుల కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్  రామ్ పోతినేనిని ట్రెండీ హెయిర్‌డో,  షేడ్స్ ధరించి సూపర్ స్టైలిష్ ఇంకా మ్యాసీవ్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. షర్టు, జీన్స్‌తో జాకెట్ ధరించి, తుపాకీని పట్టుకొని టెర్రిఫిక్ గా కనిపించారు రామ్. అతని వెనుక చాలా వెపన్స్ ఉన్నాయి. సినిమాలో మనం చూడబోతున్న మాస్, యాక్షన్ వైబ్ ని పోస్టర్ సూచిస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌తో సహా పలు చిత్రాలలో పూరీ జగన్నాధ్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ డబుల్ ఇస్మార్ట్‌ కు సంగీతం అందిస్తున్నారు.

Double iSmart In Cinemas In 100 Days On March 8th:

 Ram Pothineni, Puri Jagannadh Project Double iSmart In Cinemas In 100 Days On March 8th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs