Advertisement
Google Ads BL

ఇంట్రెస్టింగ్ గా మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్


మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో ప్రారంభమైన కన్పప్ప సినిమాలో విష్ణు మంచు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ కన్నప్ప ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. విష్ణు మంచు బర్త్ డే (నవంబర్ 23) సందర్భంగా కన్నప్ప నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా మీద భారీ అంచనాలను నెలకొల్పేలా ఉంది.

Advertisement
CJ Advs

భారీ శివలింగం.. విల్లుని ఎక్కు పెట్టిన కన్నప్ప లుక్.. ఆ బాణాలు దూసుకెళ్తున్న తీరు.. చుట్టూ ప్రకృతి, దట్టమైన అడవి ఇలా అన్నీ చూస్తుంటే.. తెరపైకి ఓ అద్భుతం రాబోతున్నట్టుగా అనిపిస్తోంది. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడానికి కన్నప్ప ఎంత కష్టపడుతోందో ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్థం అవుతోంది. ఈ పోస్టర్‌తో సినిమా స్థాయిని అందరికీ చూపించేసింది కన్నప్ప యూనిట్.

ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే 80 శాతం షూటింగ్‌ పార్ట్‌ను కంప్లీట్ చేయనున్నారు. న్యూజిలాండ్‌లో ఇంత వరకు తెరపై చూపించని విజువల్స్‌ను అద్భుతంగా చూపించబోతున్నారు. కన్నప్పను ఓ విజువల్ వండర్‌గా.. తెరపై ఎప్పటికీ చెరిగిపోని ఓ దృశ్యకావ్యంలా ఉండేలా నిర్మిస్తున్నారు.  హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ ఈ సినిమాను ఉన్నతమైన స్థాయిలో చూపించబోతున్నారు.

కన్నప్ప సినిమా కోసం మా ప్రాణాన్ని పనంగా పెడుతున్నాం. మహా శివుడి ప్రియ భక్తుడైన కన్నప్పను తెరపైకి తీసుకొచ్చేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. కన్నప్ప సినిమాను ఓ దృశ్యకావ్యంలా.. మునుపెన్నడూ చూడని ఓ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రూపొందిస్తున్నాం అని విష్ణు మంచు అన్నారు.

Kannappa First look Poster:

Manchu Vishnu Kannappa unveil the much awaited First look Poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs