Advertisement
Google Ads BL

దళారి సెన్సార్‌ పూర్తి


రాజీవ్‌ కనకాల, శకలక శంకర్‌, శ్రీతేజ్‌, ఆక్సాఖాన్‌, రూపిక ప్రధాన తారాగణంగా కాచిడి గోపాల్‌రెడ్డి రచన దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్‌ రెడ్డి నిర్మించిన చిత్రం దళారి. ఈ చిత్రంలో అన్నదమ్ముల మధ్య మంచి ఎమోషనల్‌ సన్నివేశాలతో పాటు, రాజకీయ నాయకులు, దళారిలు, బినామీల మధ్యలో జరుగుతున్న కొత్త అంశాలను జోడిస్తూ, సెన్సార్‌ పూర్తి చేసుకొని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు. ఇందులో భాగంగా పొలిమేర-2 ఫేమ్‌ సత్యం రాజేష్‌ రచయిత, దర్శకులు, ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌, హీరో సునీల్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ ను లాంచ్‌ చేశారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా పొలిమేర-2 ఫేమ్‌ సత్యం రాజేష్‌ మాట్లాడుతూ.. మా శంకర్‌ హీరోగా చేసిన సాంగ్‌ చాలా బాగుంది. ఒకరకమైన ఫీల్‌తో, పల్లెటూరి బ్యాగ్రౌండ్‌తో మంచి మ్యూజిక్‌ అందించారు అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయండి. మా డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి పెద్ద డైరెక్టర్‌ అవుతాడు, ప్రొడ్యూసర్‌కి మంచి డబ్బులోస్తాయి ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రచయిత, దర్శకులు, ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌ మాట్లాడుతూ.. తమ్మడు గోపాల్‌ రెడ్డి దర్శకత్వంలో హరిగౌర మ్యూజిక్‌ అందించి మా తమ్ముడు శంకర్‌, రాజీవ్‌కనకాల నటించి, వెంకట్‌ రెడ్డి నిర్మించిన ఒక హాట్‌ టచింగ్ సాంగ్‌ను సుద్దాల అశోక్‌ తేజ రాశారు, ఈ సాంగ్‌ చాలా డెప్త్‌ ఉంది కథ ఏంటో తలియకుండానే ఒక ఎమోషన్‌లోకి తీసుకెళ్ళింది, ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందా లేదా అన్నట్టు, ఒక్కవిజువల్‌ చాలు, ఈ సాంగ్‌ చాలు, ఈ సినిమాను ఎంత ప్రేమించి, ఎంత డెప్తుల్లో చెప్పారు ఈ కథని అని, నేను చాలా ఇంప్రెస్‌ అయ్యానన్నారు, ఇది చూస్తుంటే ఒక బలగం లాంటి సినిమాగా ఎప్పటికీ గుర్తుండి పోయే మెలోడిగా మంచి అన్నదమ్ముల ఎమోషన్‌గా సాంగ్‌ చూసిన ప్రతి ఒక్కరికీ నెలలు సంవత్సరాలు గుర్తుండి పోతుందని ఈ సినిమా కూడ ఈ సాంగ్‌ లాగా పెద్ద హిట్‌ అవుతందని చిత్ర యూనిట్‌ కి శుభాకాంక్షలు తెలిపారు.

హీరో సునీల్‌ మాట్లాడుతూ.. అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్‌ సాంగ్‌ మనందరి కళ్ళకు నీళ్ళు తెప్పిస్తుంది, చాలా మంచి హార్ట్‌ టచింగ్‌ సాంగ్‌ మీరు కూడ చూసి ఎంజాయ్‌ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చిత్ర యూనిట్‌ కి శుభాకాంక్షలు తెలిపారు.

డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబాలలో అందరి కళ్ళముందు జరిగే అంశాల ఆధారంగా  ప్రతి సన్నివేశం తీసుకోవడం జరిగింది. పాటలో ఉన్న ఎమోషన్‌ ని మా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రతిరోజు ఫీలై తీసిన చిత్రం దళారి, ఇదొక కొత్త ట్రెండ్‌ చేస్తుంది. సీనియర్‌ ప్యాడింగ్‌ ఆర్టిస్తులు. టెక్నీషియన్స్‌ తో రూపొందిన చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది. ఈ పాటను లాంచ్‌ చేసిన కోన వెంకట్‌ గారికి, సత్యం రాజేష్‌ గారికి, సునీల్‌ గారికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రొడ్యూసర్‌ వెంకట్‌ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని అతి త్వరలో థియోటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని వేడుకొన్నారు.

Dalari Movie Coming Soon :

Dalari Movie Censor is complete
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs