Advertisement
Google Ads BL

బాబ్జీ దర్శకత్వంలో పోలీసు వారి హెచ్చరిక


అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్ధన్ తన తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న పోలీస్ వారి హెచ్చరిక చిత్రం సింగిల్ షెడ్యూల్లో శరవేగంగా జరుగుతుంది. రెగ్యులర్ గా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ముహూర్తాలు, సాంప్రదాయ పద్ధతులకు, అట్టహాసాలకు భిన్నంగా దసరా పండగ రోజున సినీ కళామతల్లికి జై.. వర్ధిల్లాలి తెలుగు సినీ పరిశ్రమ వర్ధిల్లాలి భారతీయ సినీ పరిశ్రమ అనే నినాదాల మధ్య ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

Advertisement
CJ Advs

దసరా రోజున ప్రారంభమైన ఈ చిత్రం తాలుకు షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాదు, ఘట్ కేసర్, ఘణ పూర్, షామీర్ పేట తదితర ప్రదేశాలలో జరుపుకుంటూ 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుందని, ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో సినిమాలోని కీలక ఘట్టాలతో పాటు మూడు పాటలు, రెండు ఫైట్ లను పూర్తి చేసుకుందని, డిసెంబర్  మొదటివారం నాటికి ఈ చిత్రం తాలూకు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని దర్శకుడు బాబ్జీ తెలిపారు.

మన పిల్లలకు, మన కుటుంబానికి పంచే ప్రేమలో కొంతయినా మన చుట్టూ వుండే అనాథ బాలలకు పంచకపోతే, మన పిల్లల భవిష్యత్ గురించి చేసే ఆలోచనలో, పడే తపనలో, తీసుకునే జాగ్రత్తలో కొంతయినా మన కళ్ళ ముందు తిరుగుతున్న అనాథలు అభాగ్యుల విషయంలో ప్రదర్శించకపోతే ఆ అనాథలు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో చిక్కుకొని సమాజాన్ని నాశనం చేసే నేరస్థులుగా మారే ప్రమాదం వుందనే సందేశం అంతర్లీనంగా సాగుతూ, పూర్తి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని బాబ్జీ తెలిపారు.

భారత సైన్యంలో దేశరక్షణ కోసం పని చేసిన నేను మొట్టమొదటి సారిగా సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాను, దర్శకులు బాబ్జీ చెప్పిన కథలో వున్న సమాజానికి, దేశానికి ఉపయోగపడే గొప్ప సందేశం నచ్చి యీ చిత్రాన్ని నిర్మిస్తున్నానని, నటీనటులు, సాంకేతిక వర్గం మనస్ఫూర్తిగా అందిస్తున్న సహకారంతో యీ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తున్నాము అని నిర్మాత బెల్లి జనార్ధన్ పేర్కొన్నారు. పాన్ ఇండియా నటుడిగా ఎదుగుతున్న అజయ్ ఘోష్ గతంలో ఏ చిత్రంలోనూ చేయని గొప్ప పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారని, ఆ పాత్ర ఈ చిత్రానికే ఆయువు పట్టు లాంటి పాత్ర అని నిర్మాత బెల్లి జనార్దన్ తెలిపారు.

Police Vaari Heccharika Movie Opening:

Police Vaari Heccharika the team is passionately working
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs