Advertisement
Google Ads BL

బ్యూటిఫుల్ లొకేషన్లలో కన్నప్ప చిత్రీకరణ


డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుంది. అక్కడి ప్రకృతి, వాతావరణం, అందమైన ప్రదేశాలను అద్భుతంగా చూపించబోతున్నారు. ఇలాంటి భారీ చిత్రానికి న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సెట్ అవుతుంది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి చిత్రాలను ఇక్కడే షూట్ చేశారు. ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చేందుకు కన్నప్ప టీం ప్రయత్నిస్తోంది.

Advertisement
CJ Advs

దేవుడు సృష్టిలో న్యూజిలాండ్ అనేది అందమైన పెయింటింగ్ లాంటిది.. కన్నప్ప సినిమాకు న్యూజిలాండ్ అనేది పర్ఫెక్ట్ లొకేషన్. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, కన్నప్పలోని ఎమోషన్‌ను న్యూజిలాండ్‌లోని లొకేషన్లు ఇంకా ఎలివేట్ చేస్తాయి అని మంచు విష్ణు తెలిపారు. ఈ మూవీని శ్రీకాళహస్తి గుడిలో ప్రారంభించారు. అక్కడే కన్నప్ప తన రెండు కళ్లను ఆ శివుడికి అర్పించేందుకు సిద్దపడతారు.

న్యూజిలాండ్‌లోని ప్రకృతి దృశ్యాలను, అత్యాధునిక సినిమాటిక్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ కన్నప్ప సినిమాతో ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపే దృశ్యకావ్యంగా రూపొందించాలని మంచు విష్ణు భావిస్తున్నారు. న్యూజిలాండ్‌లో ప్రారంభించిన ఈ మూవీని అత్యుత్తమ రీతిలో చిత్రీకరించేందుకు ఎంతో అంకితభావంతో పని చేస్తున్నాం. అగ్రశ్రేణి ప్రతిభావంతులు, నటీనటులు, అత్యాధునిక సాంకేతికతతో,  రాబోతున్న తరాల వారికి గుర్తిండిపోయేలా ఓ కళాఖండంగా ఈ కన్నప్పను తెరకెక్కిస్తున్నామని మంచ విష్ణు అన్నారు.

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ కన్నప్ప సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు, అలాగే భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ కన్నప్పలో భాగం కానుంది. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు

Vishnu Manchu Kannappa shooting update:

Vishnu Manchu mounts Kannappa on an epic scale and chooses the enchanting landscape of New Zealand to shoot the film 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs