Advertisement
Google Ads BL

సూర్య 43 నుంచి ఎగ్జైటింగ్ అనౌన్సమెంట్


విమర్శకుల ప్రశంసలు పొందిన, నేషనల్ అవార్డు-విన్నింగ్ బ్లాక్‌బస్టర్ చిత్రం సూరరై పొట్రు (ఆకాశం నీ హద్దురా)కి దర్శకత్వం వహించిన సుధా కొంగర,  హీరో సూర్య 43వ చిత్రం కోసం మరోసారి కలిసి పని చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ సంగీతం అందించనున్నారు.

Advertisement
CJ Advs

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ చిత్రం సంగీత దర్శకుడిగా జివి ప్రకాష్‌కి ఇది100వ చిత్రం కావడం విశేషం.

సూరారై పోట్రు సూర్య నటనా జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగిన విశేషమైన చిత్రం. సూరరై పొట్రును రూపొందించిన అసాధారణమైన కోర్ టీమ్ -- ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ఆ సంవత్సరం జాతీయ అవార్డులను గెలుచుకుంది. సూర్య43వ చిత్రం చేయడానికి ఆ టీం మళ్లీ కలిసి రావడం అతని అభిమానులను థ్రిల్ చేయడం ఖాయం.

ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషించనున్నారు. సూర్య, దుల్కర్ ఇద్దరూ అద్భుతమైన పెర్ఫార్మర్స్. ఈ ఇద్దరినీ తెరపై చూడటం అభిమానులు, ప్రేక్షకులకు ఫీస్ట్ లా ఉండబోతుంది.

నజ్రియా ఫహద్, విజయ్ వర్మ కూడా స్టార్ కాస్ట్‌లో భాగం కానున్నారు.

#Suriya43ని సూర్య సొంత నిర్మాణ సంస్థ, 2D ఎంటర్‌టైన్‌మెంట్ పై జ్యోతిక, సూర్య,  రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్‌ పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

సూర్య, సుధా కొంగర, జి వి ప్రకాష్‌లు మళ్లీ కలిసి ఒక సినిమా కోసం వస్తున్నారనే వార్త, అది సెట్స్‌పైకి వెళ్లకముందే అంచనాలను పెంచింది.

Suriya 43rd film announcement :

Soorarai Pottru team comes together again for Suriya 43rd film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs