Advertisement
Google Ads BL

డెవిలిష్ పొలిటీషియన్ గా మాళవిక


నందమూరి కళ్యాణ్ రామ్..విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం డెవిల్. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆదివారం ఈ మూవీలో ప‌వ‌ర్‌ఫుల్ పొలిటీషియ‌న్ పాత్ర‌లో న‌టిస్తోన్న హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్ పాత్ర‌కు సంబంధించిన లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 

Advertisement
CJ Advs

మ‌ణిమేక‌ల పాత్ర‌లో మాళ‌వికా నాయ‌ర్ క‌నిపించ‌నున్నారు. ఆమె లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్లో క‌నిపిస్తున్నారు. మైకు ముందు నిలబ‌డి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న‌ట్లు ఉంది. అయితే ఆమె పాత్ర‌కు ఈ సినిమాకు క‌థ‌కు ఉన్న లింకేంట‌నేది తెలుసుకోవాలంటే మాత్రం న‌వంబ‌ర్ 24న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న సినిమాను చూడాల్సిందేనంటున్నారు నిర్మాత‌లు. 

పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో డెవిల్ సినిమాను  న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. డెవిల్ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన బింబిసారతో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది డెవిల్ తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు.

Malvika Nair as a powerful politician in spy thriller Devil:

Malvika Nair as a powerful politician in Nandamuri Kalyan Ram spy thriller Devil
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs