Advertisement
Google Ads BL

టైగర్ ఆయుధం లేకుండానే..


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం టైగర్ 3. అక్టోబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన మేకర్స్ సల్మాన్ ఖాన్ అలియాస్ టైగర్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో సల్మాన్ ఇనుప గొలుసు పట్టుకుని శత్రువుల భరతం పట్టటానికి సిద్ధంగా కనపడుతున్నారు.

Advertisement
CJ Advs

ఈ పోస్టర్ ద్వారా టైగర్ 3 చిత్రం రా అండ్ రియలిస్టిక్‌గా ఉంటూనే ప్రేక్షకులకు వావ్ అనిపించేలా ఉంది. ఇక ట్రైలర్ ఎలా ఉండబోతుందోనని అందరిలోనూ క్యూరియాసిటీ పెరుగుతుంది. తిరుగులేని శక్తితో టైగర్ తన శత్రువులను వేటాడటానికి సిద్ధంగా ఉందని  అది ట్రైలర్‌తో మరోసారి తెలియనుందని అవగతమవుతుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 రానుంది. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ టైగర్ 3 చిత్రం రా అండ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. టైగర్ ఫ్రాంచైజీ విషయానికి వస్తే అందులో హీరోని లార్జర్ దేన్ లైఫ్‌లా ఆవిష్కరిస్తారు. హీరో అందులో హీరో ఆయుధం లేకుండానే శత్రువుల అంతం చూస్తాడు. తన శత్రువుల్లో చివరివాడు అంతమయ్యే వరకు టైగర్ అలాగే నిలబడి ఉంటాడు. తను సవాళ్లను స్వీకరిస్తాడు. దాన్ని పూర్తి చేయటంలో వెనకడుగు వేయడు. నిజ జీవితంలోనూ టైగర్ తన వేటను పూర్తి చేసే వరకు వెనకడుగే వేయదు. ఇందులో నా పాత్ర టైగర్‌లా ఉంటుంది. హీరో పాత్ర పోరాటంలో వెనక్కి తగ్గకుండా ఉంటుంది. తను అస్సలు వెనక్కి తగ్గడు. దేశం కోసం చివరి వరకు నిలబడే వ్యక్తి తనే అవుతాడు.

అలాంటి టైగర్ పాత్రను సిల్వర్ స్క్రిన్‌పై వైఆర్ఎఫ్ సంస్థ ఎలా ఆవిష్కరించనుందో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రేక్షకుల్లోనూ అదే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆడియెన్స్ టైగర్ యాక్షన్‌ని చూడటానికి ఇష్టపడతారు. అక్టోబర్ 16న విడుదలవుతున్న ట్రైలర్ ఆడియెన్స్‌కి నచ్చుతుందని భావిస్తున్నాను. ఇందులో ప్రేక్షకులు ఇప్పటి వరకు వెండి తెరపై చూడనటువంటి అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలున్నాయి అన్నారు.

సాధారణ ప్రేక్షకులతో పాటు నెటిజన్స్ సైతం టైగర్ 2 ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో తదుపరి ఆధ్యాయంగా ఆదిత్య చోప్రా దేన్ని చూపించబోతున్నారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటి వరకు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ బ్యానర్ వచ్చిన స్పై థ్రిల్లర్స్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఈ యూనివర్స్ నుంచి ఇప్పటి వరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు టైగర్ 3 రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

Tiger can take on an army of people with his bare hands! : Salman Khan:

Salman Khan Tiger 3
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs