Advertisement
Google Ads BL

టైగర్ 3లో యాక్షన్ కోసం కష్టపడ్డాను: క‌త్రినా


బాలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ క‌త్రినా కైఫ్ య‌ష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్స్‌లో తొలి లేడీ స్పై ఆఫీస‌ర్‌గా న‌టించారు. వైఆర్ఎఫ్ బ్యాన‌ర్‌లో రూపొందిన టైగ‌ర్ ఫ్రాంచైజీలో స‌ల్మాన్ ఖాన్ పోషించిన టైగ‌ర్ పాత్ర‌కు ధీటుగా ఉండే జోయా పాత్ర‌లో క‌త్రినా అద్భుతంగా ఒదిగిపోయారు. ఈ ఫ్రాంచైజీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏక్ థా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హై చిత్రాలు రూపొందితే అందులో జోయా పాత్ర‌లో క‌త్రినా న‌టించిన తీరుకి యావ‌త్ సినీ ప్ర‌పంచం ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షాన్ని కురిపించాయి. ఆమె ఎంతో క‌ష్ట‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అద్భుతంగా న‌టిస్తుంద‌ని ఈ చిత్రాలు రుజువు చేశాయి.

Advertisement
CJ Advs

ఈ టైగ‌ర్ ఫ్రాంచైజీలో జోయా పాత్ర‌ను క‌త్రినా కైఫ్ త‌ప్ప మ‌రొక‌రు చేయ‌లేర‌నేలా యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఆమెను ప్ర‌శంసిస్తూ టైగ‌ర్ 3 చిత్రం నుంచి జోయా పాత్ర‌లో న‌టిస్తోన్న క‌త్రినా కైఫ్ పోస్ట‌ర్‌ను నిర్మాత‌లు విడుద‌ల చేశారు. టైగ‌ర్‌3లో ఎంతో క‌ష్టంతో కూడిన యాక్ష‌న్ స‌న్నివేశాలు గొప్ప‌గా ఉండ‌టానికి, ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉండ‌టానికి క‌త్రినా శాయ‌శ‌క్తులా కృషి చేసింది.

ఈ సంద‌ర్భంగా క‌త్రినా మాట్లాడుతూ ‘‘వైఆర్ఎఫ్  సంస్థ రూపొందిస్తోన్న స్పై యూనివ‌ర్స్‌లో తొలి లేడీ స్పై పాత్ర జోయా. ఆ పాత్ర‌ను నేను పోషించ‌టం అనేది ఎంతో గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను.  భ‌యానికి లోను కాకుండా ధైర్యంగా ముందుకు సాగిపోయే జోయా క్యారెక్ట‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అంతే కాదు.. ఆమె స‌హృద‌యం క‌ల‌ది. త‌న‌వారిని ర‌క్షించుకుంటూనే విధేయ‌త‌ను చూప‌గ‌ల మ‌న‌స్త‌త్వం ఆమె సొంతం. త‌న అవ‌సరం ఉన్న ప్ర‌తీ చోట ప్ర‌త్య‌క్షం కావ‌టంతో పాటు అక్క‌డ మాన‌వత్వాన్ని చూపుతుంటుంది.

జోయా పాత్ర‌ను పోషించ‌టం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ప్ర‌తి సినిమా నాకొక ప‌రీక్ష‌గానే భావిస్తాను. అందులో ఈ టైగ‌ర్ 3 సినిమా కూడా ఉంది. ఈ సారి టైగ‌ర్ 3లో యాక్ష‌న్ స‌న్నివేశాలు నెక్ట్స్ లెవ‌ల్లో ఉండాల‌ని ముందుగానే భావించాం. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల్లో శారీర‌కంగా ఎక్కువ క‌ష్ట‌ప‌డింది ఈ సినిమాకే. యాక్ష‌న్ స‌న్నివేశాలు గొప్ప‌గా ఉండాల‌ని నా శాయ‌శ‌క్తులా క‌ష్ట‌ప‌డ్డాను. నేను యాక్ష‌న్ సినిమాల‌కు అభిమానిని. అలాంటి నేను యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించ‌టం ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. కాబ‌ట్టి జోయా పాత్ర‌లో న‌టించ‌టం అనేది నా క‌ల నిజ‌మైన‌ట్లుగా ఉంది. నా పాత్ర ధైర్యంతో, సవాళ్ల‌ను ఎదుర్కొనేలా, బ‌లంగా ముందుకు సాగేలా ఉంటుంది. ఈ జోయా పాత్ర‌ను రేపు స్క్రీన్స్‌పై చూసేట‌ప్పుడు ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

టైగ‌ర్ 3 చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమా దీపావ‌ళి సంద‌ర్బంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Have pushed my body to breaking point for Tiger 3! : Katrina Kaif:

<span>Katrina Kaif on Tiger 3 action&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs