Advertisement
Google Ads BL

దేవేందర్‌ గౌడ్‌ 4 రచనలు ఆవిష్కరణ


మాజీ హోంమంత్రి, రాజ్యసభ సభ్యులు శ్రీ దేవేందర్‌ గౌడ్‌ గారి 4 రచనలు 1) రాజ్యసభ స్పీచెస్‌ (ఇంగ్లీష్‌), 2) అంతరంగం (వివిధ రంగాలపై ఆయన అభిప్రాయాలు, 3) శాసనసభ ప్రసంగాలు 1994-99, 1999-2004 సంకలనాలను ఈ రోజు సాయంత్రం హోటల్‌ దసపల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు, మాజీ స్పీకర్‌ మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ కె.ఆర్‌ సురేష్‌ రెడ్డి గారు ఆవిష్కరించారు. శ్రీ వెంకయ్యనాయుడు గారు మొదటి రెండు పుస్తకాలను ఆవిష్కరించగా.. శాసన సభ ప్రసంగాలను సురేష్‌ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంధ రచయిత శ్రీ దేవేందర్‌ గౌడ్‌ గారు ముందుగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు గారికి, గెస్ట్‌ ఆఫ్‌ ఆనర్‌గా వచ్చిన శ్రీ సురేష్‌ రెడ్డి గారికి ధన్యవాదాలు.

Advertisement
CJ Advs

శ్రీ వెంకయ్యనాయుడు గారు తెలుగువారు గర్వించదగిన వ్యక్తి. అనేక పదవులు నిర్వహించి ఆ పదవులకే వన్నె తెచ్చారు. నేను రాజ్యసభ సభ్యునిగా ఉండగా వెంకయ్యనాయుడు గారు కూడా సభలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఉపరాష్ట్రపతి  హోదాలో రాజ్యసభ చైర్మన్‌గా ఉండి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి నా రాజ్యసభ ప్రసంగాలను, అంతరంగం పుస్తకాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. కె.ఆర్‌. సురేష్‌ రెడ్డి గారు స్పీకర్‌గా ఎంతో హుందాగా సభను నడిపేవారు. ఎంత ఒత్తిడిలో కూడా సంయమనం కోల్పోయేవారుకాదు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి నా అసెంబ్లీ ప్రసంగాలను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది.

నేను 1987లో శ్రీ ఎన్టీ రామారావు గారి ప్రోత్సాహంతో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌గా పోటీ చేసి గెలిచిన తర్వాత 3 పర్యాయాలు శాసనసభ్యునిగా, 10 సంవత్సరాలు క్యాబినెట్‌ మంత్రిగా తదుపరి 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేసే అవకాశం లభించింది.

నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేశాను. ప్రజా సమస్యలను సమర్ధవంతంగా చట్టసభలలో లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేశాను.

ఆ సమయంలో చట్టసభల ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం అందరికీ లభించేది. అందువల్లనే అనేక ప్రజా సమస్యలను లేవనెత్తగలిగాను.  

దేశంలో అనేక స్థాయిలలో చట్టసభలు ఉన్నాయి. వాటన్నింటికి రాజ్యసభ ఆదర్శంగా నిలుస్తుంది. అయితే, ఇటీవలి కాలంలో చట్టసభలలో చర్చలు తగ్గి వాదోపవాదాలు పెరుగుతున్నాయి. సభల ప్రిసైడిరగ్‌ అధికారులపై ఒత్తిడి పెరుగుతున్నది.

పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభలో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. సమర్ధులైన వారిని చట్టసభలకు పంపింనట్లయితే.. ప్రజా ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. ఇక, ఈ పుస్తకాల సమాచార సేకరణకు రామోజీ గ్రంధాలయం ఎంతో ఉపయోగపడిరది. అదేవిధంగా, పుస్తక రూపకల్పనలో సహాయపడిన వారందరికీ నా కృతజ్ఞతలు.

శ్రీ సురేష్‌ రెడ్డి గారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

దేవేందర్‌ గౌడ్‌ గారి అసెంబ్లీ ప్రసంగాలు, రాజ్యసభ ప్రసంగాలను పుస్తక రూపంలో ప్రచురించడం ఎంతైనా సముచితం. ఆయన జ్ఞానం, అనుభవం రాబోయే తరాల వారికి అవసరం. ప్రజాస్వామ్యం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందికనుకనే ప్రజాస్వామ్య వాదులకు ఈ పుస్తకాలను అంకితం చేశారు. బడుగు బిడ్డగా రాజకీయ ప్రవేశం చేసి, రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో గొప్ప సామాజిక మార్పుకు శ్రీ దేవేందర్‌ గౌడ్‌ గారు శ్రీకారం చుట్టారు.

1994లో దేవేందర్‌ గౌడ్‌ గారు మంత్రిగా ఉండగా నేను కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాను. ఆ సమయంలో నేను తెలంగాణ ప్రాంత వెనుకుబాటు తనాన్ని గురించి సభలో ప్రస్తావించాలని నోటీస్‌ ఇచ్చినపుడు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న అశోక్‌ గజపతిరాజు గారు వెనుకబడిన ప్రాంతాల మీద మాట్లాడమన్నారు . కానీ నేను నాకు తెలిసిన తెలంగాణ వెనుకబాటుతనం గురించి పరిమితమై మాట్లాడతానని చెప్పినపుడు.. దేవేంద్రగౌడ్‌ గారు అధికారపక్షంలో ఉండి కూడా నన్ను మాట్లాడమని సైగ చేస్తూ ప్రోత్సహించారు. అంటే ఆనాటి నుంచే దేవేందర్‌ గౌడ్‌ గారికి ఈ ప్రాంత సమస్యలపట్ల, ప్రజల ఆకాంక్షలపట్ల పూర్తి అవగాహన ఉండటమే కాకుంగా సానుభూతి, సహానుభూతి ఉంది అని నాకు అర్ధమయింది.  

నేను అసెంబ్లీ స్పీకర్‌ గా ఉండగా అనేక అంశాలపై అనర్గళంగా మాట్లాడేవారు.

విపక్ష సభ్యునిగా ఆయన ఉన్నరోజుల్లో బీసీ హాస్టళ్లలో విద్యార్థులు పడుతున్న అగచాట్లను వర్ణించిన తీరుకు నాటి సభ కదిలిపోయింది. ఆనాడు సభలో అందరూ కలిసి ఒక తీర్మానం చేశాము. అదేమంటే.. నాతోసహా ప్రతి ఎమ్మెల్యేలు నెలకొకసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో నిద్ర చేసి అక్కడి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవాలన్నది. దేవేందర్‌ గౌడ్‌ గారు ఆ సమయంలో చేసిన సాంఘిక సంక్షేమ హాస్టళ్ల యాత్ర ప్రభుత్వాన్ని కదిలించింది.

శాసనసభలో ఆయన పూర్తి సాధికారతతో మాట్లాడేవారు. గణాంకసహితంగా ఆయన చేసిన ప్రసంగాలు పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చుకునేవారు. ఇక, రాజ్యసభ ప్రసంగాల పుస్తకాన్ని నేను పరిశీలించినపుడు ఆయన అనేక మార్గాలలో ప్రజా సమస్యలను లేవనెత్తారు.

రాజకీయ లబ్ది కోసం కాకుండా వాస్తవాలను మాట్లాడడం నాకు కనిపించింది. ఉదాహరణకు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిపై హైదరాబాద్‌ నగరంలో దాడులు జరుగుతున్నాయంటూ వచ్చిన ఒక అంశంపై ఆయన మాట్లాడుతూ అటువంటిదేమీ లేదని హైదరాబాద్‌ నగరంలో అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా జీవించగలిగే పరిస్థితులు ఉన్నాయని.. ప్రతిపక్ష నేతగా ఆయన అప్పటి ప్రభుత్వాన్ని సమర్ధించిన తీరు ఆయన నిజాయితీకి, రాజనీతిజ్ఞతకు అద్దంపడుతుంది.

ఇక, వెంకయ్యనాయుడు గారు ఢల్లీిలో లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఉత్తరాదికి, దక్షిణాదికి మద్య వారధిగా ఉండేవారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించడానికి తనవంతు కృషి చేసేవారు.

ఇటీవల లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెరమీదకు వచ్చినపుడు ప్రగతిపథంలో నడుస్తున్న దక్షిణాది రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దేవేందర్‌ గౌడ్‌ గారి రచనలు ప్రతి ఒక్కరూ చదవాలి. ఇందులోని విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఔత్సాహిత రాజకీయ వేత్తలకు ఈ పుస్తకంలోని సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.

శ్రీ వెంకయ్యనాయుడి గారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

రచనా వ్యాసాంగం కొనసాగిస్తూ ఈరోజు 4 విలువైన పుస్తకాలను ప్రజల ముందుకు తెచ్చిన మిత్రులు దేవేందర్‌ గౌడ్‌ గారికి అభినందనలు. చట్టసభల్లో మేలైన, నాణ్యమైన ప్రసంగాల ప్రమాణాలను నెలకొల్పిన వారిలో శ్రీ దేవేందర్‌ గౌడ్‌ ఒకరు. రాజకీయాల్లో 4 దశాబ్దాలు ఉండి అనేక ఉన్నత పదవులు నిర్వహించినప్పటికీ. అవినీతి మచ్చ లేకుండా ఆదర్శప్రాయంగా నిలవడం గొప్ప విషయం. 

చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే కలిగే ప్రయోజనం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పేందుకు దేవేందర్‌ గౌడ్‌ ప్రత్యక్ష నిదర్శనం. ఇంతకుముందు 2018లో ఆయన రాసిన రెండు పుస్తకాలను నేనే ఆవిష్కరించాను. 

ఓ ప్రజాప్రతినిధిగా, ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా సుదీర్ఘ అనుభవం గలిగిన శ్రీ దేవేందర్‌ గౌడ్‌ తన విలువైన అనుభవాలను గ్రంథస్తం చేయడం ఎంతైనా అభినందనీయం. 2012-18 మధ్య 6 ఏళ్లపాటు శ్రీ దేవేందర్‌ గౌడ్‌ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 2012-14 మధ్యకాలంలో నేను కూడా రాజ్యసభలో ఉన్నాను.

ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిన సందర్భం అది. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య తీవ్రమైన భావోద్వేగాలు పొడసూపిన సందర్భం కూడా అది.  

అటువంటి సమయంలో శ్రీ దేవేందర్‌ గౌడ్‌ తెలంగాణ ఉద్యమకారుడిగా తన ప్రాంత పరిస్థితులను, ప్రజల మనోభావాలను అవకాశం వచ్చినప్పుడల్లా రాజ్యసభలో లేవనెత్తారు. దేశ ప్రజల దృష్టికి అనేక అంశాలను రాజ్యసభ వేదికగా తీసుకువెళ్లారు. అయితే, ఆయన తన ప్రాంత సమస్యలను లేవనెత్తినప్పటికీ ఎవర్నీ నొప్పించలేదు.

ఒకవైపు రాజ్యసభలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూనే, సభ వెలుపల కూడా ఆయన అనేక ఉద్యమాలు సాగించారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయ సాధన కోసం వివిధ పార్టీల నేతలతో చర్చలు జరపడం, పార్టీలతో సమన్వయం చేసుకోవడం వంటి రాజకీయ ప్రక్రియలలో చురుకైన భాగస్వామ్యం వహించారు.

శ్రీ దేవేందర్‌ గౌడ్‌ రాజ్యసభ ప్రసంగాలు గానీ, అంతకుముందు 2004-14 మధ్య 10 ఏళ్ల పాటు ఎన్టీఆర్‌ క్యాబినెట్‌లో, ఆ తర్వాత శ్రీ చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లో మంత్రిగా కీలకమైన శాఖలను నిర్వహించినపుడు అసెంబ్లీలో చేసిన ప్రసంగాలను పరిశీలిస్తే ఆయనకు స్వాభావికంగా అబ్బిన జ్ఞానంతోపాటు, రాజకీయ పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి చేసిన కృషి కూడా కనిపిస్తుంది.

చట్టసభలలో చేసిన ప్రసంగాల సంకలనాలతోపాటు అంతరంగం అనే పేరుతో వివిధ రంగాలపై తన అభిప్రాయాలను, అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను అక్షరీకరించారు. నిజానికి, ఈ పుస్తకాలు భావితరాల వారికి కరదీపికలుగా ఉపయోగపడతాయి.

ప్రజాస్వామ్యం బలోపేతం అవ్వాలంటే చట్టసభలు పటిష్టవంతంగా పని చేయాలి. చట్టసభల ప్రయోజనాన్ని ప్రతి ప్రజాప్రతినిధి తెలుసుకొని సమర్ధవంతంగా ఉపయోగించుకోగలగాలి. తమను చట్టసభలకు పంపించిన ప్రజల పట్ల కృతజ్ఞత, బాధ్యత ప్రతి మాటలో, చర్యలో వ్యక్తం కావాలి. అయితే, ఇటీవలికాలంలో చట్టసభల ప్రాధాన్యత తగ్గుతున్న నేపథ్యంలో వాటి ఉపయోగాన్ని తెలియపర్చడం ఎంతో ముఖ్యం. రాజకీయాల్లో పాజిటివిటీ ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. శత్రువుల్లా కాకుండా ప్రత్యర్ధుల్లా ఉండాలి.

నేను ఉపరాష్ట్రపతిగా నామినేషన్‌ వేసిన మరుక్షణం నుంచే సమకాలీన రాజకీయ మీద మాట్లాడటం మానుకున్నాను. అయితే, ప్రజా జీవితంలో మాత్రం కొనసాగుతూనే ఉన్నాను. ఇక, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. అమ్మభాష పోతే శ్వాసపోయినట్లే. ఇంగ్లీషు నేర్చుకోవాలి గానీ, వ్యామోహం పెంచుకోవద్దు. అలాగే, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్దపెట్టాలి. ఇంట్లో వండిన వంటనే తినాలి. ఇవన్నీ నేను ప్రతి సభలో చెబుతూ ఉంటాను. కొందరైనా అనుసరిస్తారన్న నమ్మకం నాకుంది. ఇక, చివరగా దేవేందర్‌ గౌడ్‌ గారి కుమారులు ముగ్గురు తండ్రి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను.  

చరిత్రలో జరిగిన అనేక పరిణామాలకు సాక్షిగా ఉన్న శ్రీ దేవేందర్‌ గౌడ్‌ ఆ అంశాలను యధాతథంగా అందించినందున ఈ పుస్తకాలను ప్రతి ఒక్కరూ చదవాలని కోరుకుంటున్నాను.

దేవేంద్ర ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీ విజయేందర్‌ గౌడ్‌ ప్రసంగం

ఈ సభా కార్యక్రమాన్ని దేవేంద్ర మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీ విజయేందర్‌ గౌడ్‌ నిర్వహించారు. జ్యోతి ప్రజ్జ్వలన కార్యక్రమం తర్వాత కార్యక్రమం మొదలైంది. పుస్తక రూపకల్పనలో సహకరించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ విక్రమ్‌ పూల ఈ పుస్తకాలను, గ్రంధ రచయిత శ్రీ దేవేందర్‌ గౌడ్‌ గారిని పరిచడం చేస్తూ మాట్లాడారు.

Devender Goud 4 Writings Invention:

4&nbsp;<span>Writings</span>&nbsp;by Mr. Devender Goud, Member of Rajya Sabha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs