బిగ్ బాస్ 7 లో గొడవలు తార స్థాయికి చేరుతున్నాయి. శివాజీ అందరిపై తరచూ ఫైర్ అవుతున్నాడు. శివాజీ డెసిషన్ ని ఆట సందీప్, అమరదీప్ లు ఒప్పుకోవడం లేదు. తాజాగా శివాజీకి అమరదీప్ కి గొడవైనట్టుగా ఈరోజు వదిలిన ప్రోమోలో చూపించారు. ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో అందాల పోటీలు నిర్వహించగా.. అందులో జెడ్జ్ గా వ్యవహరించిన శివాజీ డెసిషన్ ని అమరదీప్ ఒప్పుకోలేదు.
కంటెస్టెంట్స్ అయిన రతిక, పల్లవి ప్రశాంత్, తేజ, సుబ్బు, గౌతమ్, ప్రిన్స్ మధ్యన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టి శివాజీ, సందీప్, శోభా శెట్టిలని జెడ్జ్ లుగా నియమించారు. ఈ అందాల పోటీలో శుభశ్రీని శివాజీ, సందీప్, శోభా శెట్టి లు విన్నర్ గా ప్రకటించగానే అమరదీప్ మేము సరిగ్గా పెరఫార్మెన్స్ ఇవ్వలేదా అంటూ, మీ జేడ్గ్మెంట్ పై నాకు నమ్మకం లేదు, నేను మాట్లాడాక చెప్పండి, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వలేదా, మీకు ఇష్టమైన వాళ్ళనే విజేతలుగా ప్రకటిస్తారా అనగానే శివాజీ అమరదీప్ పై ఫైర్ అయ్యాడు.
సుబ్బు మాకు ఇన్నోవేటివ్ గా, చెప్పిన డ్రెస్ ప్రకారం మాకు కనిపించింది, ముందు నువ్వు రూల్స్ బుక్ చూసి మాట్లాడు అని అనగానే.. ముందు ఇవి వాడుకోమని చెప్పారు, మాకు ఇవ్వన్నీ చెప్పలేదు సర్ అంటూ అమరదీప్ అన్న ప్రోమో వైరల్ గా మారింది.