Advertisement
Google Ads BL

మాస్, క్లాస్ పాత్రలో శ్రీలీల


స్కంద టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ శ్రీలీల స్కంద విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు. 

Advertisement
CJ Advs

ధమాకా హిట్ తర్వాత స్కందతో వస్తున్నారు.. ఎలా అనిపిస్తుంది ? 

చాలా ఎక్సయిటెడ్ గా వుంది. ప్రేక్షకులు చాలా ప్రేమ,అభిమానాన్ని ఇస్తున్నారు. నేను కూడా సినిమా ద్వారా వారికి ప్రేమ, అభిమానాన్ని ఇవ్వాలనేది నా ప్రయత్నం. 

స్కంద లో మీ పాత్ర  ఎలా వుంటుంది ?

ఇందులో చాలా రూల్స్ నియమాలు పాటించే అమ్మాయిగా కనిపిస్తాను. నా పాత్రలో మాస్ క్లాస్ రెండూ మిక్స్ లో వుంటాయి. ఇందులో కొన్ని సీన్స్ నా రియల్ లైఫ్ నుంచి కూడా వచ్చాయి(నవ్వుతూ).  

 

రామ్ గారు... మీరు ఇద్దరూ ఎనర్జిటిక్ గా వుంటారు కదా.. సెట్స్ లో ఎలా వుండేది ? 

స్కంద చాలా మంచి అనుభవం. మా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. బోయపాటి గారు చాలా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. డబ్బింగ్ చెప్పినపుడు చాలా ఎంజాయ్ చేశాను. 

రామ్ గారి తో డ్యాన్స్ ని మ్యాచ్ చేయడం కష్టం అనిపించిందా ? 

రామ్ గారి డ్యాన్స్ ని మ్యాచ్ చేయడం కష్టం. ఐతే ఇద్దరం ఒకరికొకరు కాంప్లిమెంట్ చేస్తూ చేశాం. నేను కూడా ఏవో కొత్తకొత్తగా ప్రయత్నించాను. ( నవ్వుతూ)  

ఇందులో మీ పాత్రకు ఎమోషన్ సీన్స్ ఉన్నాయా ? 

ఎమోషన్ సీన్స్ వున్నాయి. దీనితో పాటు సరదాగా ఉండే సన్నివేశాలు వుంటాయి. కాలేజ్ డ్రామా కూడా వుంది. రామ్ గారికి, నాకు మధ్య క్యూట్ కెమిస్ట్రీ వుంటుంది. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను.స్కంద చేస్తున్నప్పుడు యాక్షన్ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్ ని అద్భుతంగా చూపించడం బోయపాటి గారి మార్క్ . ఇలాంటి స్టయిల్ లో చేయడం నాకు కూడా కొత్త. స్కంద చాలా గ్రాండ్ గా వుంటుంది. స్కంద తర్వాత మరింత రీచ్ రావాలని కోరుకుంటున్నాను. 

రామ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? 

రామ్ గారితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఇలాంటి పాత్ర చేయడం నాకు కొత్త. ఈ విషయంలో రామ్ గారు చాలా గైడ్ చేశారు. రామ్ గారితో పనిచేసే అవకాశం ఇంత త్వరగా రావడం నా అదృష్టం. 

నిర్మాణ సంస్థ గురించి ? 

యాక్షన్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ వున్న సినిమా స్కంద. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లు అంతా వున్నారు. క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు రోడ్డు మొత్తం కార్వాన్ లు ఉండేవి. నిర్మాత శ్రీనివాస చిట్టూరి గారు ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్ నిర్మించారు.  

డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది ? 

ధమాకా సినిమాకి కూడా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. స్కంద విషయానికి వస్తే.. బోయపాటి గారు ముందే ట్రైన్ చేశారు. బోయపాటి గారి డైలాగ్స్ పవర్ ఫుల్ గా వుంటాయి. ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడం నాకు ఇదే మొదటిసారి. 

బోయపాటి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? 

ఇంత మాస్ యాక్షన్ సినిమా చేయడం ఇదే తొలిసారి. స్కంద బోయపాటి గారి మార్క్ లో గ్రాండ్  గా వుంటుంది. నా పాత్రని ఇలా చెప్పాలని అనుకున్నారు. ఆయన ఇన్పుట్స్ తీసుకొని నా ఫ్లేవర్ కూడా యాడ్ చేయడం జరిగింది.

ధమాకాలో మీ డ్యాన్సులకే ప్రత్యేకంగా అభిమానులు వున్నారు. ఇప్పుడు దానికి మంచి ఇందులో కనిపిస్తున్నాయి ? ఎలా అనిపిస్తుంది ? 

నా ఫేవరట్ సాంగ్ అని ఏది చెప్పాలో అని ఆలోచించే పరిస్థితిలో వున్నాను (నవ్వుతూ). నిజంగా డ్యాన్స్ లకు ఇంత పేరు వస్తుందని అనుకోలేదు. స్కంద లో పాటల్లో డ్యాన్స్ లు కూడా చాలా బావుంటాయి. మాస్, వెస్ట్రన్.. రెండూ రకాల డ్యాన్సులు అలరిస్తాయి.  

ప్రస్తుతం దాదాపు గా ఎనిమిది సినిమాలు చేస్తున్నారు కదా.. కథల విషయంలో మీ ఎంపిక ఎలా వుంటుంది?

నిజానికి ఈ సినిమాలన్నీ ఒకేసారి వచ్చినవి కాదండీ. స్కంద, పెళ్లిసందడి తర్వాత సైన్ చేసిన సినిమా. దాదాపు మూడు సినిమాలు పెళ్లి సందడి తర్వాత ఒప్పుకున్నవే. ఇప్పుడు అన్నీ ఒకేసారి రావడంతో అలా అనిపిస్తుంది. కథల ఎంపికలో జాగ్రత్తగానే వుంటాను. 

Sreeleela Interiew:

Sreeleela Interiew about Skanda 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs