Advertisement
Google Ads BL

రవితేజ ఈగల్ రిలీజ్ డేట్


మాస్ మహారాజా రవితేజ ధమాకా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రెండవసారి ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో యూనిక్ ఎంటర్ టైనర్ ఈగల్ చిత్రాన్ని చేస్తున్నారు. మేకర్స్ ఇదివరకే రవితేజ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  

Advertisement
CJ Advs

ఈరోజు, మేకర్స్  ఇంటెన్స్ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈగల్ 2024 సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. పోస్టర్‌లో రవితేజ చేతిలో తుపాకీతో నిప్పుఅంటుకున్న అడవిలో స్టైలిష్‌గా నిల్చున్నట్లుగా వుంది. అయితే, పోస్టర్‌లో రవితేజ ముఖం కనిపించదు, అక్కడ మనం రెస్క్యూ టీం విమానం చూడవచ్చు.

సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.

కార్తీక్ ఘట్టమనేని రచన , దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు కార్తిక్ స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ హైబడ్జెట్ ఎంటర్‌టైనర్ కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు.మణిబాబు కరణం డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. దవ్‌జాంద్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.

Eagle Arriving On January 13th:

Ravi Teja Eagle Arriving On January 13th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs