Advertisement
Google Ads BL

అక్రమ కేసులు పెట్టి, జెల్లో పెట్టిన బాబును వెంటనే విడుదల చెయ్యాలి -అట్లూరి నారాయణ రావు


ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి, జెల్లో పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గు చేటని, బాబును తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకొమ్మని తెలుగు చిత్ర నిర్మాత, ఎన్ .టి .ఆర్. సెంటినరీ కమిటీ సభ్యుడు అట్లూరి నారాయణ రావు శుక్రవారం రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు విజ్ఞప్తి చేశారు. అలాగే ఢిల్లీలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ ను స్వయంగా కలసి లేఖ ను అందించారు. 

Advertisement
CJ Advs

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు గారు రాజకీయ కుట్ర ఫలితంగా జైలు పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాడు, అందులో ఎలాంటి అవినీతి జరగకపోయినా, ఎలాంటి ఆధారాలు ప్రభుత్వానికి లభించక పోయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డిడి కక్ష సాధింపు చర్య అని అన్ని వర్గాల ప్రజలకు అర్థమవుతోంది. 

ఎస్ ఎస్ డి.సి ప్రాజెక్టులో, ప్రభుత్వం మొత్తం ఖర్చులో 10 శాతం మాత్రమే ఖర్చు చేస్తే, మిగిలిన 90 శాతం ప్రైవేట్ సంస్థలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటికే 2.13 లక్షల మందికి అతి తక్కువ ఖర్చుతో శిక్షణ ఇచ్చామని, మరింత నైపుణ్యానికి పదును పెట్టేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి.  

ప్రస్తుతం జగన్ ప్రభుత్వం వాటిని సద్వినియోగం చెయ్యకుండా నిరుద్యోగుల భవిష్యత్తు తో ఆదుకోవడం విచారకరం. 1995-2004 మధ్య కాలంలో నారా చంద్ర బాబు ముఖ్యమంత్రిగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి హైదరాబాద్ రూపు రేఖలను మార్చారు. ముఖ్యంగా 2004 తర్వాత హైదరాబాద్‌లో శతాబ్దాల చరిత్ర ఉన్న చార్మినార్ స్థానంలో శ్రీ నారా చంద్ర బాబు గారు కలల నిర్మాణం సైబర్ టవర్స్ నిర్మించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ ను ప్రశంసిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మానవీయ కోణంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తూ నారా చంద్ర బాబు ఎన్నో సాధించారు. సాంకేతిక విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఆయన కృషితో ఏర్పాటైన వందలాది ఇంజినీరింగ్ కళాశాలలు ఇప్పటికీ ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఐటీ మేధావులను తయారు చేస్తున్నాయి . 

విభజిత ఆంధ్రప్రదేశ్‌ను ఎన్నో సంక్షోభాల నుంచి గట్టెక్కించేందుకు 2014 ద్వితీయార్థం నుంచి నారా చంద్ర బాబు తీసుకున్న అద్వితీయ నిర్ణయాలు వృద్ధి రేటును సాధించే స్థాయికి ఎదిగాయి. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలన్న చంద్ర బాబు  ప్రణాళిక యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. రైతుల నుంచి ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించి, నామమాత్రపు ప్రభుత్వ ఖర్చుతో లక్షల కోట్ల సంపద సృష్టించాలన్న ఆయన దార్శనికత అమోఘం. 

ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే, అమరావతి దేశం గర్వించదగ్గ ప్రపంచం మెచ్చుకునే రాజధానిగా ఈనాటికి ఆవిష్కృతమై ఉండేది. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం సాకారమై రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేసేది. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం నేటికీ కొనసాగుతోంది. వ్యవస్థలను ధ్వంసం చేస్తూ తాబేదార్లకు పెద్దపీట వేస్తూ జగన్ చేస్తున్న అరాచక పాలన వల్ల రాబోయే 20 ఏళ్లకు కూడా ఆంధ్రప్రదేశ్ కోలుకోలేదు.  

ఈ గందరగోళం, అరాచకాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ని గట్టెక్కించే సర్వశక్తిమంతుడు శ్రీ నారా చంద్రబాబే అని ప్రజలందరికీ అర్ధమైంది. ఇది గ్రహించిన జగన్ రెడ్డి ఎలాగైనా బాబును జైలుకు పంపాలని రాజకీయ కక్షతో తప్పుడు కేసుల్లో నిందితుడిగా చేశాడు. బాబు అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా రాష్ట్రం, దేశం, ప్రపంచంలోని తెలుగు వారంతా నిరసనలతో రోడ్లపైకి వచ్చి తమ సంఘీభావం తెలుపుతూ ర్యాలీలు నిర్వహిస్తూ, నేను సీబీఎన్‌తో ఉన్నాను అంటూ మద్దతు ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల అచంచలమైన విశ్వాసం మరియు అభిమానాన్ని కలిగి ఉన్న నాయకుడు బాబు. అలాంటి అరుదైన నాయకుడి అడుగుజాడల్లో నడవడం గర్వకారణం. కడిగిన ముత్యంలా రాజమండ్రి జైలు నుంచి బాబు బయటకు వచ్చే తరుణం కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దయచేసి ఈ విషయంలో మీరు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అట్లూరి నారాయణ రావు తన లేఖలో పేర్కొన్నారు .

Babu in jail, should be released immediately -Atluri Narayana Rao:

Who filed illegal cases and put Babu in jail, should be released immediately -Atluri Narayana Rao, 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs