Advertisement
Google Ads BL

డెవిల్ నుంచి మాయే చేశావే సాంగ్ రిలీజ్


నందమూరి కళ్యాణ్ రామ్.. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం డెవిల్. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. 

Advertisement
CJ Advs

రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ టీజర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ రావటంతో పాటు సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డెవిల్ మూవీ నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో డెవిల్ సినిమా నుంచి మాయే చేశావే.. అనే పాటను తొలి సాంగ్‌గా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను ఐకాన్ మ్యూజిక్ విడుదల చేసింది. 

మాయే చేశావే.. పాటను గమనిస్తే ఇదొక అద్బుతమైన మెలోడీ సాంగ్. పాట వింటున్నప్పుడు ప్రేక్షకులు అందమైన అనుభూతికి లోనవుతారు. స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడటం ఇంకా హైలైట్‌గా నిలిచింది. కచ్చితంగా ఈ పాట ఆడియెన్స్ ప్లే లిస్ట్ లో రిపీటెడ్ సాంగ్ అవుతుంది. 

ఈ పాటకు బృంద మాస్టర్ నృత్యాన్ని సమకూర్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సూపర్బ్ రెట్రో ట్రాక్‌ను అందించారు. కళ్యాణ్ రామ్, సంయుక్త మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. మాయే చేశావే.. సాంగ్‌తో మేకర్స్ ఓ ఎగ్జయిటింగ్ మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు. 

పాటలో కళ్యాణ్ రామ్, సంయుక్త అద్బుతమైన నటనతో మెప్పించారు. వీరి మధ్య కుదిరిన చక్కటి కెమిస్ట్రీ ఆడియెన్స్‌ని ఎంతో గొప్పగా అలరిస్తుంది. 

Maaye chesey aong from Devil:

 Kalyan Ram periodical spy thriller Devil, first single Maaye chesey out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs