ఊహించినట్టుగానే బిగ్ బాస్ సీజన్ 7 ఎన్నో సంచలనాలకు వేదికైంది. రేటింగ్స్ పరంగా, వ్యూయర్ షిప్ పరంగా ఊహించని ఎన్నో అద్భుతాలకు స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 వేదిక గా నిలిచింది. సీజన్ సీజన్ కీ అపూర్వంగా పెరుగుతున్న ఆదరణ ఈ సీజన్ కి వచ్చేసరికి ఎన్నో రెట్లు పెరిగి తెలుగు టెలివిజన్ చరిత్ర లోనే సరికొత్త ప్రమాణాలను సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ఈ షో చూస్తున్నారు.
ఇంచుమించు 5. 1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు చెబుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఆవిష్కరణ కార్యక్రమాన్ని సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో గతంలో క్రికెట్ మ్యాచ్ ల వీక్షణ పరంగా నమోదైన రికార్డు లను కూడా తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 అధిగమించటం విశేషం. ఈ సీజన్ బిగ్ బాస్ ఎంతగా ఉర్రూతలూగించిందో చెప్పాలంటే గత సీజన్ లో సాధించిన రేటింగ్ తో పోలిస్తే 40% అధిక రేటింగ్ నిదర్శనం అని చెప్పాల్సి ఉంటుంది. తిరుగులేని ఈ ప్రేక్షక ఆదరణతో ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న స్టార్ మా... నెంబర్ 1 ఛానల్ గా తన స్థానాన్ని మరోమారు బిగ్ బాస్ సీజన్ సాక్షిగా వెల్లడించింది.
ఈ సీజన్ ఉల్టా పల్టా గా ఉండబోతోంది అని కింగ్ నాగార్జున ప్రోమోలో చెప్పిన నాటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగాయి. అది ఈ గణాంకాలలో కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ ను సరాసరిన 7.1 % రేటింగ్ తో చూస్తే, మెట్రో నగరమైన హైదరాబాద్ లో అత్యధికంగా 8.7% రేటింగ్ తో వీక్షించడం విశేషం. తొలి వారం లోనే సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిన బిగ్ బాస్ సీజన్ 7 రాబోయే ఎపిసోడ్స్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టించ నుందో ...!?
ఈ షో కి స్టార్ మా లో మాత్రమే కాదు .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో, యూ ట్యూబ్ లో కూడా విపరీతమైన ఆదరణ వుంది.