Advertisement

బాబు అరెస్ట్ ను సినీ పరిశ్రమ పట్టించుకోలేదు


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ పై తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి  ఒక్కరు కూడా స్పందించకపోవడం పట్ల ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, "మొదటి నుంచి నేను కాంగ్రెస్ వాదిని. తెలుగుదేశం పార్టీని ఏ రోజు సపోర్ట్ చేయలేదు.అయినప్పటికీ  చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ చంద్రబాబునాయుడు లాంటి అనుభజ్ఞుడు ఉంటే మంచిదని బావిస్తుంటాను. చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపులు చేయలేదు. 

Advertisement

14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అలాంటి వ్యక్తి జైలులో ఉండకూడదు. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు  ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయి. అయితే చంద్రబాబు అరెస్టుపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించకపోవడం నాకు చాలా భాధను కలిగించింది.  జూనియర్ ఎన్టీఆర్ సహా చిరంజీవి ,మురళీమోహన్, అశ్వనీదత్, రాజమౌళి, దామోదరప్రసాద్ వంటి సినీ ప్రముఖులతో పాటు తుమ్మల ఇంటి పేరును నందమూరి లాగా ఫీలయ్యే నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ కానీ ఇతర సినీ పరిశ్రమ పెద్దలెవరూ చంద్రబాబు అరెస్ట్ ను ఖండించకపోవడం దారుణం. 

 వాస్తవానికి పరిశ్రమలో చంద్రబాబు అభిమానులు, మద్దతుదారులు ఎక్కువ అనే పేరుంది. వీళ్ళు అంతా చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు మాకు ఇవి కావాలి!...అవి కావాలి! అని లబ్ది పొందిన వారే.  ప్రతీ సందర్భంలోనూ  సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తిగా చంద్రబాబు పేరు సంపాదించుకున్నారు.  ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడుగా అండగా ఉండటం మానవత్వం. చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే వైఎస్ జగన్ ఏమన్నా ఉరితీస్తాడా? లేక కేసులు పెడతారని వీరందరికీ భయమా? నాకు అర్ధం కావడం లేదు. వెనుకాల నుంచి ముసుగు వేసుకుని బయటకు కనిపించకుండా  సపోర్ట్ చేసేవాళ్లు దొంగలు, ముందుండి మద్దతు ఇచ్చిన హీరో పవన్ కళ్యాణ్.మాత్రమే. సినీ పరిశ్రమ పెద్దలు దొంగ ముసుగులు వేసుకోవద్దు" అంటూ నట్టి కుమార్ దుయ్యబట్టారు.

The film industry ignored ChandraBabu arrest:

Natti Kumar Sensational Comments over Chandrababu arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement